Lovers c/o ...  koneru temples

ప్రేమజంటలు …. కేరాఫ్ కోనేరు ఆలయాలు 

పుంగనూరు ముచ్చట్లు :

శ్రీ కాశీవిశ్వేశ్వరస్వామి ఆలయానికి కాపలాదారు లేకపోవడంతో విశాలమైన ఈ ఆలయ ప్రాంగణం ఉదయం నుంచి రాత్రి వరకు ప్రేమికులు ముచ్చట్లు చెప్పుకునేందుకు అనువైన ప్రాంతంగా మారిపోతోంది. దేవాదాయశాఖ ఆధీనంలో ఉన్న ఈ ఆలయానికి పురాతన చరిత్ర ఉంది. చారిత్రాత్మకమైన పుష్కరిణికి అనుసంధానంగా ఉన్న ఈ ఆలయంలో శ్రీ అన్నపూర్ణ ఆలయం, శ్రీ అంజనేయ , శ్రీ అయ్యప్పస్వామి ఆలయాలు ఉన్నాయి. వీటి మధ్యన గల విశాలమైన ప్రాంతం ప్రేమజంటలకు విడిదిగా మారుతోంది. ఆలయాల సంరక్ష ణకు అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో గతంలో ఇక్కడి నవగ్రహాలను అన్యమతస్తులు వచ్చి ధ్వంసం చేసిన సంఘటనలు , పలుమార్లు చోరీలు జరిగాయి. దీనిపై వెంటనే చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు.

Tag: Lovers c/o …  koneru temples

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *