యోగాతో నడుము నొప్పి సయాటికా బీపీ షుగర్ మటుమాయం..

-యోగ నిర్వాహకులు ఆనంద్ గురూజీ….
నంద్యాలముచ్చట్లు
నంద్యాల మున్సిపల్ పార్క్ నందు గల ఆయుష్ యోగా కేంద్రం లో నడుము నొప్పి సయాటికా లోయర్ బ్యాక్ పెయిన్ ఊబకాయం పొట్ట బెల్లి మరియు షుగర్ బిపి పక్షవాతము గుండె జబ్బు ఉన్నవారికి విడివిడిగా మాస్టర్ లతో యోగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందని యోగా నిర్వాహకులు ఆనందగురుజీ తెలిపారు.ఈ సందర్భంగా ఆనంద్ గురించి మాట్లాడుతూ శిక్షణకు హాజరైన వారి సమస్యలను అడిగి తెలుసుకొని వైద్య పరీక్షలు నిర్వహించి విడివిడిగా శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు.
ఆసనములు ప్రాణాయామము నేర్పబడును శారీరక దారుడ్యం కొరకు భుజము నొప్పి ఉన్నవారికి వణుకుడు వ్యాధి
ఉన్నవారికి తేలికపాటి వ్యాయామ పరికరాలు మరియు ఆక్యుప్రెజర్ పరికరాలు మసాజ్ రోలర్ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు గ్యాస్ ట్రబుల్ అల్సర్ ఎసిడిటీ సైనస్ సమస్య ఉన్నవారికి జలదౌ టీ జలనేతి సూత్రనేతి క్రియల ద్వారా మలబద్ధకము  సమస్య ఉన్న వారికి శంఖ ప్రక్షాళన క్రియ ద్వారా సమస్యలు తొలగించబడుతుంది. అని తెలిపారు కింద కూర్చుని చేయలేని వారి కోసం పెద్దవయసు వారి కోసం బల్లలు ఏర్పాటు చేయడమైనది అన్నారు. మానసిక ప్రశాంతత కొరకు ఉల్లాసంగా ఉత్సాహంగా ఉండుటకు ప్రతి ఆదివారం ఆటలు పాటలు జోక్స్ కోలాటం ఏరోబిక్ డాన్స్ నవ్వుల జల్లు కార్యక్రమాలు ఉంటాయన్నారు దీనితోపాటు ప్రతిరోజు ఆయు ఆరోగ్య కేంద్రంలో విటమిన్లు ప్రోటీన్లు మినరల్స్ కార్బోహైడ్రేట్స్ కూడిన ఎటువంటి పోషక విలువలు నశించకుండా ప్రకృతి సిద్ధమైన పండ్లు కూరగాయలు   మొలకెత్తిన గింజలు డ్రై ఫ్రూట్స్ తో పాటు కూరగాయల రసాలు పండ్ల రసాలు ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఇస్తున్నట్లు పేర్కొన్నారు అనేక రకాల దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతూ ఉపశమనం కొరకు  ప్రకృతి ఆశ్రమాలకు వెళ్లలేని ఆర్థిక స్తోమత లేని వారిని దృష్టిలో పెట్టుకొని యోగా శిక్షణ తరగతులను ఏర్పాటు చేసినట్లు తెలిపారు ఈనెల 5వ తేదీ శనివారం నుండి  నూతన ఉచిత యోగా శిక్షణ తరగతులు ప్రారంభం కానున్నాయి కానున్నాయి ఉదయం 5 గంటల 20 నిమిషాల నుండి ఆరు నెలల వరకు  ఒక బ్యాచ్ ఉదయం 7 గంటల నుండి 8 గంటల వరకు మరొక బ్యాచ్కు శిక్షణ ఇవ్వడం జరుగుతుందన్నారు ఈ అవకాశాన్ని పట్టణ ప్రజలతో పాటు సమీప గ్రామాల ప్రజలు ఉపయోగించుకోవాలని ఆనంద్ గురించి తెలిపారు హాజరు కాదలచిన వారు యోగ మ్యాట్ లేదా బెడ్ షీట్ వాటర్ బాటిల్ వెంట తెచ్చుకోవాలన్నారు.
 
Tags:Low Back Pain With Yoga Sciatica BP Sugar Matumayam ..

Natyam ad