Natyam ad

 అద్దంకి రోడ్డు కు శిలాఫలకం ఆవిష్కరణ చేసిన మద్దిశెట్టి

దర్శి ముచ్చట్లు:
ప్రకాశం జిల్లా దర్శి లో శుక్రవారం దర్శి శాసనసభ్యులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ దర్శి నుండి అద్దంకి వెళ్ళు రోడ్డు మరమ్మత్తుల నిమిత్తం శంకుస్థాపన చేశారు. వేదమంత్రాలు తో పురోహితులు డాక్టర్ మద్దిశెట్టి వేణుగోపాల్ చే పూజలు చేయించి తదుపరి శిలపలఖం ఆవిష్కరణ చేశారు. ఈ సందర్బంగా శాసనసభ్యులు వేణుగోపాల్ మాట్లాడుతూ దర్శి 0.8 నుండి శంకరాపురం వద్ద 26.0 కిలోమీటర్స్ వరకు మరమ్మత్తులు జరుగుతుంది అని తెలిపారు. ఈ రోడ్డు నిమిత్తం 6కోట్ల 20లక్షలు ఖర్చు చేస్తున్నట్లు తెలిపారు. ఇంకాదర్శి నుండీ పొదిలి వరకు రోడ్డు కూడా త్వరలో ప్రారంభిస్తామని తెలిపారు. తదుపరి దర్శి నుండీ కురిచేడు సాగర్ కాలువ వరకు కూడా రోడ్డు ప్రారంభిస్తామని  తెలిపారు.ఈ సందర్బంగా శాసనసభ్యులు వేణుగోపాల్ ను, ఎంపీపీ ని స్థానిక వైసీపీ నాయకులు శాలువాలు కప్పి ఘజ మాలతో ఘనంగా సత్కరించారు.ఈ కార్యక్రమం లో దర్శి ఎంపీడీఓ,తహసీల్దార్, ఎంపీపీ , వైస్ ఎంపీపిలు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్,దర్శి సింగిల్ విండో అధ్యక్షులు,నగర పంచాయతీ కౌన్సిలర్స్,వైసీపీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Maddishetti who unveiled the plaque to Addanki Road