Maha Brieli of the blind

అంధుల మహానీయుడు బ్రెయిలీ

-అసాధారణ ప్రతిభ సామర్థ్యాల జ్ఞానం

Date: 04/01/2018

ఢీల్లీ ముచ్చట్లు:

ప్రపంచ అంధులకు జ్ఞాన కవచాలను ప్రసాదించిన మహనీయుడు లూయీ బ్రెయిలీ. 1809 జనవరి 4న పారిస్‌ దగ్గరలోని క్రూవే గ్రామంలో జన్మించాడు. అతని తల్లిదండ్రులు మోనిక్‌ బ్రెయిలీ, సైమన్‌ రెనె బ్రెయిలీ. బాల్యంలో ప్రమాదవశాత్తు రెండు కళ్ళను కోల్పోయి తన 4వ ఏట పూర్తిగా గుడ్డివాడయ్యాడు. పారిస్‌లో 1784లో వాలెంటైన్‌ హ్యూ ప్రారంభించిన అంధుల పాఠశాలకు బ్రెయిల్‌ చదువు కోవడానికి వెళ్ళాడు. బ్రెయిల్‌ అసాధారణ ప్రతిభ సామర్థ్యాలు గల వ్యక్తిగా రాణించి, అప్పటికి అమలులో ఉన్న లైన్‌ టైపు పద్ధతిలో చదువుకుని 17 సంవత్సరాల వయస్సులోనే అదే స్కూలులో ప్రొఫెసరుగా నియమించబడ్డాడు. పగలు విద్యార్ధులకు బోధిస్తూ, రాత్రులు అంధులు తేలికగా చదవగలిగే, రాయగలిగే లిపి తయారీకై కృషిచేసాడు.

Tags: Maha Brieli of the blind

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *