Natyam ad

మహానంది పుణ్యక్షేత్రం లో అత్యంత వైభవోపేతంగా మహా శివరాత్రి బ్రహ్మోత్సవాలు .

-ఫిబ్రవరి 27 నుండి ప్రారంభమై  మార్చి 04 తేదీ వరకు..
-కార్యనిర్వాహణాధికారి కె. చంద్రశేఖర్ రెడ్డి…
మహానందిముచ్చట్లు:
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు నేటి నుంచి ప్రారంభం…  మహానంది క్షేత్ర కార్యనిర్వహణ అధికారి కె. చంద్రశేఖర్ రెడ్డి జరిగింది.ఈ సందర్భంగా మహానంది క్షేత్ర ఈ.వో చంద్రశేఖర్ రెడ్డి మాట్లాడుతూ, మహాశివరాత్రి సందర్భం పురస్కరించుకొని అత్యంత వైభవోపేతంగామహానంది పుణ్యక్షేత్రం లో బ్రహ్మోత్సవాలు ఫిబ్రవరి 27. 02. 2022 నుండి ప్రారంభమై మార్చి 04.03. 2022 వరకు బ్రహ్మోత్సవాలు ముగియనున్నాయి, ప్రతిరోజు ఉదయము సాయంకాలము వాహన సేవలు జరుగుతాయని, మహానంది పుణ్యక్షేత్రం శ్రీ శ్రీ శ్రీ శ్రీ కామేశ్వరి సహిత మహానందీశ్వర స్వామి వారిని దర్శించుకోవడానికి వచ్చిన భక్తులకు అన్ని సౌకర్య సదుపాయాలు సమకూర్చడం జరిగిందని, నా పదవీ బాధ్యతలు స్వీకరించిన అనతికాలంలోనే, ఈ మహనంది క్షేత్రంలో ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాన్ని సవరించడం తోపాటు, భక్తులకు సౌకర్యాలు చేకూర్చే విధంగా ప్రయత్నించడం జరిగింది. ముఖ్యంగా నంద్యాల నుండి మహానంది క్షేత్రానికి వచ్చే రహదారిలో అస్తవ్యస్తంగా తయారవడంతో జిల్లా వెంటనే జిల్లా కలెక్టర్ వారితో మాట్లాడితే, వారు వెంటనే స్పందించి  ఆ రోడ్ల మరమ్మతులు చేపట్టడం జరిగిందని, అలాగే కోనేరుల ప్రాశస్త్యం గురించి తెలియజేయడం జరిగిందని, వెంటనే కోనేర్లు పరిశుభ్రం చేయించుకోమని, ఆదేశాలు జారీ చేశారని, మేము సిబ్బందితో కలిసి కోనేరులో శుభ్రం చేయించి, భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు లేకుండా సౌకర్యం కల్పించామని, ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా మహానంది పుణ్యక్షేత్రము కోనేరు లోని జలము పుణ్య జలముగా సుప్రసిద్ధ పవిత్రమైన జలముగా ప్రసిద్ధిగాంచినది, కనుక ఈ కోనేరులో స్నానం చేసిన భక్తులకు సర్వరోగాలు నశించి,  చర్మ సౌందర్యం, పవిత్రత పొంది పుణ్యం దక్కుతుందని, భక్తులు భావిస్తారు. అంతేకాకుండా భక్తుల సౌకర్యార్థమై మహానంది క్షేత్రానికి 1 కిలో మీటర్ దూరం వాహనాలు నిలుపుకోవడానికి, స్థలం కేటాయించామని, కావున భక్తులు దేవస్థానం వారికి సహకరించి, మేము కేటాయించిన స్థలాల్లో వాహనాలు నిలుపుకొని, దూర ప్రాంతాలనుండి కూడా వచ్చిన భక్తుల సమన్వయం పాటించాలని, ఈ పుణ్యక్షేత్రానికి విచ్చేసిన భక్తులందరికీ ఆ పరమశివుని ఆశీస్సులు, ఆయురారోగ్యాలతో ఎల్లవేళలా ఉండాలని మనస్ఫూర్తిగా ఆ దేవున్ని ప్రార్థిస్తున్నామని, కార్యనిర్వాహణాధికారి కె. చంద్రశేఖర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు.
 
Tags:Maha Shivaratri Brahmotsavam is the most glorious festival in the Mahanadi Shrine