Mahakumbhabhishekam is the beginning of the eyes of the eye

కన్నుల పండువగా ప్రారంభమైన మహాకుంభాభిషేకం

— 108 కళశములతో ఊరే గింపు
— మూడురోజులపాటు సాగనున్న పూజలు
— తరలివచ్చిన ఆర్యవైశ్యులు

Date:22/01/2018

చౌడేపల్లె ముచ్చట్లు:

మండలకేంద్రంలోని బజారువీధిలో వెలసిన శ్రీవాసవీ కన్యకాపరమేశ్వరీదేవి రజతోత్సవ మహాకుంభాభిషేకం మహ్గత్సవం సోమవారం కన్నుల పండువగా ప్రారంభమైంది. ఆలయం నిర్మించి 25 సంవత్సరాలు పూర్తిఅయిన సంధర్బంగా ఆలయంలో పూర్వక మహాచంఢీహ్గమం, మహాకుంభాభిషేకం మహ్గత్సవాలు మూడు రోజులపాటు అత్యంత •వైభవంగా జరగనున్నాయి. ఆర్యవైశ్య మహిళలచే 108 క ళశములతో గ్రామంలోని పురవీధుల ద్వారా ఊరేగింపు చేపట్టారు. అనంతరం మూలదేవతా అమ్మవారి ప్రార్థన, గంగపూజ, గోపూజ, గణపతిపూజ, గురుప్రార్థన, స్వస్తిపుణ్యాహవాచనము, దేవనాంది, పంచగవ్యము, రక్షాబంధనము, తదితర పూజ కార్యక్రమాలు తో ప్రారంభించారు.మూడురోజులపాటు జరిగే ఈ మహ్గత్సవానికి వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన ఆర్యవైశ్యులు స్వగ్రామాలకు తరలివచ్చారు. ఆలయంతోపాటు ఆవరణంలో విద్యుత్‌ దీపాలు, ప్రత్యేకపూల మద్య అత్యంత సుందరంగా అలంకరించారు.ఈమేరకు భక్తులకు అవసరమైన సదుపాయాలు, సాంస్కతి కార్యక్రమాలు నిర్వాహకులు ఏర్పాటుచేశారు.

Tags : Mahakumbhabhishekam is the beginning of the eyes of the eye

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *