మంత్రి పెద్దిరెడ్డితో పుంగనూరు మున్సిపాలిటి బైపాస్‌ రోడ్డుకు మహార్ధశ

పుంగనూరు ముచ్చట్లు:
 
పట్టణంలోని పుంగమ్మ చెరువు కట్ట నుంచి ఎంపీడీవో ఆఫీసు వరకు గల బైపాస్‌ రోడ్డుకు మహార్దశ పట్టింది. 30 సంవత్సరాలుగా అభివృద్ధికి నోచుకోని బైపాస్‌ రోడ్డు పనులు చేపట్టాలని మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదేశించారు. మంత్రి ఆదేశాల మేరకు 60 అడుగుల వెడల్పుతో రెండు అడుగుల డివైడర్లు, రోడ్డుకు ఒక వైపు మూడు అడుగుల మురుగునీటి కాలువలు నిర్మిస్తున్నారు. అలాగే రోడ్డు మధ్యలో లైట్లు , పూల వెహోక్కలు ఏర్పాటు చేసేలా అధికారులు పనులు ప్రారంభించారు. ఆక్రమణలను తొలగించి, రోడ్డును విస్తరించారు. జేసిబిలతో పనులు చేస్తూ, కాంక్రిట్‌ మిషన్లతో అత్యంత సుందరంగా సిమెంటు రోడ్డును వేస్తున్నారు. రోడ్డు విస్తరణతో కోనేటిపాళ్యెం, బ్రాహ్మణవీధి, ఆర్టీసి డిపో, బస్టాండు, తాటిమాకులపాళ్యెం, కోర్టు రోడ్డు ప్రాంతాలకు రాకపోకలకు సులభతరమైంది. దీని కారణంగా పట్టణానికి నూతన శోభ సంతరించుకొంటోంది. ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

పేదల వర్గాల ఆశజ్యోతి జగన్‌మోహన్‌రెడ్డి -ఎంపిపి భాస్కర్‌రెడ్డి
Tags: Mahardhasa to Punganur Municipality Bypass Road with Minister Peddireddy

Natyam ad