పుంగనూరు రోడ్లకు మహార్ధశ

పుంగనూరు ముచ్చట్లు:
 
మూడు దశాబ్దాలుగా అభివృద్ధికి నోచుకోని పుంగనూరులో రోడ్లకు మహార్ధశ పట్టింది. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిధున్‌రెడ్డి రోడ్ల ఏర్పాటుపై దృష్టి సారించారు. ఇందులో భాగంగా పుంగనూరు బైపాస్‌ రోడ్డును సువిశాలంగా వేసి ప్రారంభించారు. అలాగే పట్టణంలోని బైపాస్‌ రోడ్డును 60 అడుగుల వెడల్పుతో ఆక్రమణలు తొలగించి, సిమెంటు రోడ్లు వేశారు. మధ్యలో లైట్లు, డివైడర్లు ఉండేలా రోడ్డు పనులు పూర్తి చేశారు. త్వరలోనే ప్రారంభానికి సిద్దం చేస్తున్నారు. పట్టణంలోని ఆర్టీసి బస్టాండు వద్ద సర్కిల్‌ను అలాగే గ్యాస్‌ ఆఫీసుకు వెళ్లే వద్ద సర్కిల్‌ను, అంబేద్కర్‌ విగ్రహం వద్ద సర్కిల్‌ను ఏర్పాటు చేశారు. ఇక్కడ వై ఆకారంలో రోడ్డును ఏర్పాటు చేశారు. అలాగే మదనపల్లె రోడ్డు, తిరుపతి రోడ్డులోని భగత్‌సింగ్‌ కాలనీ నుంచి బాలాజి థి యెటర్‌ వరకు విస్తరించేలా మంత్రి పెద్దిరెడ్డి చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. రోడ్డు పూర్తికావడంతో పుంగనూరుకు రోడ్లకు మహార్ధశ పట్టిందని, పట్టణానికి గుర్తింపు లభించిందని ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.

Tags; Mahardhasa to Punganur roads

Natyam ad