శ్రీ‌రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద శాస్త్రోక్తంగా ప్రారంభమైన మ‌హాశాంతి యాగం

తిరుప‌తి ముచ్చట్లు:
 
లోక సంక్షేమం కోసం, ప్ర‌స్తుతం నెల‌కొన్న కోవిడ్‌-19 ప‌రిస్థితుల‌ను అధిగ‌మించ‌డానికి శ‌నివారం ఉద‌యం తిరుప‌తి శ్రీ రామ‌చంద్ర పుష్క‌రిణి వ‌ద్ద మ‌హాశాంతి యాగం శాస్త్రోక్తంగా టిటిడి ప్రారంభించింది. ఈ యాగం ఫిబ్ర‌వ‌రి 14వ తేదీ వ‌ర‌కు జ‌రుగ‌నుంది.ఇందులో భాగంగా ఉద‌యం 8.30 నుండి మ‌ధ్యాహ్నం 12 గంట‌ల వ‌ర‌కు ఆచార్య ఋత్విక్‌వ‌ర‌ణం నిర్వ‌హించారు. ఇందులోభాగంగా భగవంతుని ఆజ్ఞ మేరకు అర్చకులకు బాధ్యతలు కేటాయించారు. త‌రువాత పుణ్యాహ‌వ‌చ‌నం, పంచ‌గ‌వ్యారాధ‌న‌, కంక‌ణ ధార‌ణ‌, 34 హోమ‌గుండాల్లో అగ్ని ప్ర‌తిష్ట జ‌రిగింది. అనంత‌రం 50 మంది ఋత్వికులు పంచ శూక్త హోమం, పాల‌మాస్థిత ఉప‌నిష‌త్ హోమం, స‌ర్వ‌శాంతి హోమం, ల‌ఘుపూర్ణాహుతి జ‌రిగాయి. ఈ యాగానికి ధ‌ర్మ‌గిరి వేద విజ్ఞాన పీఠం వైఖాన‌సాగ‌మ పండితులు శ్రీ శ్రీ‌నివాస దీక్షితులు కంక‌ణ‌భ‌ట్టార్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నారు.సాయంత్రం 6 నుండి రాత్రి 9.30 గంట‌ల వ‌ర‌కు , స‌ర్వ‌శాంతి హోమకార్య‌క్ర‌మాలు నిర్వ‌హిస్తారు.ఈ కార్య‌క్ర‌మంలో శ్రీ కోదండ‌రామ‌స్వామివారి ఆల‌య ప్ర‌త్యేక శ్రేణి డెప్యూటీ ఈవో  పార్వ‌తి, ఏఈవో  దుర్గ‌రాజు, ఆగ‌మ స‌ల‌హాదారు  వేదాంతం విష్ణుభ‌ట్టాచార్యులు పాల్గొన్నారు.

Tags: Mahasanthi Yagya started scientifically at Sri Ramachandra Pushkarini

Natyam ad