మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు – పూర్ణాహుతి.

శ్రీశైలం ముచ్చట్లు:
మహాశివరాత్రి పురస్కరించుకొని సామూహిక  దీక్షతో పదకొండు రోజుల పాటు నిర్వహింపబడే మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో పదవరోజైన గురువారం రోజు  ఉదయం శ్రీ స్వామి అమ్మవార్లకు విశేషపూజలు జరిగాయి. తరువాత శ్రీ స్వామివారి యాగశాల యందు శ్రీ చండీశ్వరస్వామికి ప్రత్యేక పూజాదికాలు జరిపించబడ్డాయి. రుద్రహోమం, చండీహోమం జరిపించడ్డాయి.తరువాత యాగ పూర్ణాహుతి, వసంతోత్సవం, ఆవబృధం, త్రిశూల స్నానం కార్యక్రమాలు జరిపించబడ్డాయి.
పూర్ణహుతి
పూర్ణాహుతి కార్యక్రమంలో శాస్త్రోక్తంగా నారికేళాలు, పలు సుగంధ ద్రవ్యాలు, ముత్యం, పగడం, నూతన వస్త్రాలు మొదలైన ద్రవ్యాలను హోమగుండంలోకి ఆహుతిగా సమర్పించి యాగ కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది.అనంతరం జరిగిన వసంతోత్సవంలో ఆలయ అర్చకులు, వేదపండితులు వసంతాన్ని పసుపు, సున్నం కలిపిన మంత్ర పూరిత జలం) సమంత్రకంగా భక్తులపై ప్రోక్షించారు. తరువాత జరిగిన అవబ్బథస్నానంలో చండీశ్వరస్వామికి పుష్కరిణీ వద్ద ఆగమశాస్త్రోక్తంగా స్నానాదిక కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. చివరగా త్రిశూలస్నాన కార్యక్రమం నిర్వహించబడింది. బ్రహ్మోత్సవాలలో భాగంగా గురువారం రోజు సాయంకాలం దృజావరోహణ కార్యక్రమం జరిపించబడుతుంది.ఈ ద్వజావరోహణ కార్యక్రమంలో ఉత్సవాల మొదటిరోజున బ్రహ్మోత్సవ ప్రారంభ సూచకంగా ఆలయ ప్రధాన ధ్వజస్తంభంపై ఆవిష్కరింపజేసిన ధృజపటం అవరోహణ చేయబడుతుంది.
సదస్యం నాగవల్లి
మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగానే గురువారం రోజు  నిత్య కళ్యాణ మండపంలో సదస్యం మరియు నాగవల్లి కార్యక్రమాలు జరిపించబడ్డాయి. సదస్యం కార్యక్రమంలో వేదపండితులచే వేదసుప్తి నిర్వహించబడుతుంది.వేదసుస్తిలో వేదపండితులు చతుర్వేద పారాయణలతో, స్తోత్రాలతో శ్రీస్వామి అమ్మవార్లను ఆ తరువాత జరిగే నాగవల్లికార్యక్రమంలో మహాశివరాత్రి రోజున కల్యాణోత్సవం జరిపించబడిన శ్రీ భ్రమరాంబాదేవి వారికి ఆగమశాస్త్రం సంప్రదాయం మేరకు మెట్టెలు. నల్లపూసలు సమర్పించబడుతాయి..
ఈ రోజుతో ముగియనున్న బ్రహ్మోత్సవాలు
ఈ మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు శుక్రవారం రోజుతో ముగియమన్నాయి. ఈ ఉత్సవాల
ముగింపులో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీస్వామి అమ్మవార్లకు విశేష పూజలు జరిపించబడతాయి. తరువాత  సాయంకాలం శ్రీ స్వామివార్లకు అశ్వవాహనసేవ మరియు ఆలయ ఉత్సవం జరిపించబడుతుంది. ఆలయ ఉత్సవం అనంతరం శ్రీస్వామి అమ్మవార్లకు పుష్పోత్సవం, శయనోత్సవం – జరిపించబడతాయి.
 
Tags:Mahashivaratri Brahmotsavalu – Poornahuti

Natyam ad