శ్రీకపిలేశ్వరాలయంలో ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు.

తిరుపతి ముచ్చట్లు:
– మార్చి 1న ఏకాంతంగా మహాశివరాత్రి ప్రత్యేక కార్యక్రమాలు
తిరుపతి శ్రీ కపిలేశ్వరస్వామివారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా మార్చి 1న మహాశివరాత్రి పర్వదినం ఘ‌నంగా జ‌రుగ‌నుంది. కోవిడ్ – 19 నిబంధ‌న‌ల మేర‌కు శివ‌రాత్రి ప్రత్యేక కార్యక్రమాలు ఆల‌యంలో ఏకాంతంగా నిర్వ‌హిస్తారు.మహాశివరాత్రి సందర్భంగా మంగ‌ళ‌వారం తెల్లవారుజామున 2.30 గంటల నుండి 4.30 గంట‌ల వ‌ర‌కు మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం, ఉదయం 7 నుండి 8 గంటల వరకు రథోత్సవం(భోగితేరు), ఉద‌యం 9 నుండి 10 గంట‌ల వ‌ర‌కు స్న‌ప‌న తిరుమంజ‌నం నిర్వ‌హిస్తారు. ఉదయం 5.30 నుండి రాత్రి 12 గంటల వరకు భక్తులకు సర్వదర్శనం కల్పిస్తారు. సాయంత్రం 6 నుండి రాత్రి 10 గంటల వరకు విశేషమైన నంది వాహనసేవ ఆలయంలోనే జరుపుతారు.మార్చి 2వ తేదీ తెల్లవారుజామున 12 నుండి ఉదయం 4 గంటల వరకు లింగోద్భవకాల అభిషేకం నిర్వహిస్తారు.
 
Tags;Mahashivaratri special events in solitude at Srikapileswara Temple

Natyam ad