Make a pure carnival: the collector's call

స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దండి: కలెక్టరు పిలుపు

Date : 04/01/2018

కర్నూలు ముచ్చట్లు:

ప్రతి కుటుంబం వ్యక్తిగత మరుగుదొడ్డిని నిర్మించుకుని స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దాలని జిల్లా కలెక్టరు ఎస్‌.సత్యనారాయణ పిలుపునిచ్చారు. గురువారం స్వఛ్చాంధ్రప్రదేశ్‌ ర్యాలీని కింగ్‌ మార్కెట్‌ వద్ద కలెక్టరు జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ 5వ విడత జన్మభూమి కార్యక్రమంలో భాగంగా అన్ని మండల, గ్రామాల కేంద్రాలలో స్వచ్ఛాంధ్రప్రదేశ్‌ ర్యాలీని నిర్వహిస్తున్నామన్నారు. స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దాలంటే ఇంటికొక మరుగుదొడ్డి తప్పనిసరి అన్నారు. మరుగుదొడ్డిని నిర్మించుకోవడంతో పాటు వాటిని వాడినపుడే స్వచ్ఛ కర్నూలుగా తీర్చిదిద్దగలమన్నారు. ఇందుకు మరుగుదొడ్దు లేని వారందరూ వెంటనే మరుగుదొడ్లను నిర్మించుకోవడంతో పాటు వాటిని ఉపయోగించుకోవాలన్నారు. మరుగుదొడ్డి ని నిర్మించుకోవడానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేస్తున్నదని తెలిపారు. నగర ఎమ్మెల్యే ఎస్‌.వి.మోహన్‌ రెడ్డి మాట్లాడుతూ స్వచ్ఛ భారత్‌, స్వచ్ఛాంద్రప్రదేశ్‌లో భాగంగా వివిధ పాఠశాలల్లో రూ. 1.50 కోట్ల అంచనాతో మరుగుదొడ్లను మంజూరు చేసామన్నారు. పట్టణంలో పారిశుద్ద్యాన్ని మెరుగుపరచాలని తెలిపారు. మన ఇంటిని ఎంత పరిశుభ్రంగా వుంచుకుంటామో మన పరిసర ప్రాంతాలను కూడ అదే విధంగా వుంచుకోవాలని తెలిపారు. ప్రతి ఒక్కరూ మరుగుదొడ్డిని నిర్మించుకొని బహిరంగ మలవిసర్జన లేని నగరంగా తీర్చిదిద్దాలన్నారు. మున్సిపల్‌ కమీషనర్‌ హరినాధరెడ్డి మాట్లాడుతూ ఐదు పాఠశాలల నుండి 500 మంది విద్యార్థులతో కింగ్‌ మార్కెట్‌ నుండి ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. వ్యక్తిగత పరిశుభ్రత అందరికి అవసరమని చిన్నప్పటి నుంచే దీన్ని పాటించాలన్నారు. ప్రతి ఒక్కరూ పరిశుభ్రత, పారిశుద్ద్యంపై అవగాహన కలిగివుండాలన్నారు. చేయి చేయి కలిపి అందరూ స్వచ్ఛ కర్నూలులో భాగస్వామలుకావాలని పిలుపునిచ్చారు.

Tags : Make a pure carnival: the collector’s call

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *