మరుగుదొడ్ల నిర్మాణం,వాడకం పై అవగాహన కల్పించండి 

పెద్దపంజాణి ముచ్చట్లు:
మరుగుదొడ్ల నిర్మాణం, వాడకంపై లబ్ధిదారులకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని ఎంఈఓ హేమలత అన్నారు. స్థానిక విద్యావనరుల కేంద్రంలో  ఎంఈఓ అధ్యక్షతన మరుగుదొడ్ల నిర్వహణ పై సమీక్ష సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మండలంలోని ఉన్నత, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 8,9వ తరగతి చదువుతున్న విద్యార్థులను 5 నుంచి 8 మందిని ఒక బృందంగా ఏర్పాటు చేసి వారిచే ఆయా పాఠశాల పరిధిలోని గ్రామాలలో ప్రతి కుటుంబంలోను సర్వే నిర్వహించాలన్నారు. లబ్ధిదారుల వివరాలను సేకరించి ప్రతి గురు,శుక్రవారాల్లో తమ కార్యాలయానికి తెలపాలని ఆమె పేర్కొన్నారు. కాగా ఇప్పటికే మరుగుదొడ్లు కలిగివున్న లబ్ధిదారులను గుర్తించి వారిచేత ఓడీఎఫ్ మరియు ఐ హెచ్ హెచ్ ఎల్ పథకం ద్వారా దరఖాస్తు చేయించి వారికి కొత్తగా మంజూరు అయ్యే మరుగుదొడ్ల ను పాఠశాలలో నిర్మించే విదంగా ప్రధానోపాధ్యాయులు చొరవ చూపాలని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో అన్ని పాఠశాలల ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.
Tag:Make awareness on toilet construction and use


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *