Make people aware of the social media through social media - Emmel Peddireddy

సోషియల్‌ మీడియా ద్వారా ప్రజలను చైతన్య వంతులు చేయండి -ఎమ్మెల్యే పెద్దిరెడ్డి

Date:12/08/2018

పుంగనూరు ముచ్చట్లు:

ప్రస్తుత పరిస్థితులలో ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు సోషియల్‌ మీడియాను వినియోగించాలని వైఎస్సాఆర్సీపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్యే డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం పుంగనూరులో రాజంపేట పార్లమెంటరీ సోషియల్‌ మీడియా విభాగం పదవి స్వీకార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర సోషియల్‌ మీడియా విభాగం ్యధ్యక్షులు దేవేంద్రరెడ్డి, రైల్వేకోడూరు ఎమ్మెల్యే శ్రీనివాసులు, రాజంపేట ఇన్‌చార్జ్ ఆకేపాటి అమరనాథరెడ్డి , తంబళ్లపల్లె కన్వీనర్‌ పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోషియల్‌ మీడియా అధ్యక్షుడుగా నవీన్‌కుమార్‌రాజు బాధ్యతలు స్వీకరించారు. ఈ సభలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం అనేక పార్టీలు సోషియల్‌ మీడియాను ఆయుధంగా మార్చుకుని, ప్రజల్లో చైతన్యం తీసుకొచ్చి , అధికారాలు చేపడుతున్నారని తెలిపారు. ప్రజలు ప్రతి ఒక్కరు సాంకేతిక పరిజ్ఞానాన్ని అలవర్చుకోవడం జరిగిందన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సోషియల్‌ మీడియా ద్వారా ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని తెలిపారు. ప్రభుత్వం అమలు చేయలేని సంక్షేమ పథకాల గూర్చి సోషియల్‌ మీడియాలో విజయవంతంగా చూపెడుతున్నారన్నారు. ప్రస్తుతం కొన్ని పత్రికలు తెలుగుదేశం పార్టీకి కొమ్ముకాస్తున్నాయన్నారు. వైఎస్సాఆర్సీపికి కొన్ని పత్రికలు సహకరించక పోవడంతో ప్రభుత్వ పథకాల గూర్చి వాస్తవ పరిస్థితులతో ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అలాగే పార్టీ విధి విధానాలను ప్రజల్లోకి ఎప్పటికప్పుడు చేర్చేలా పని చేయాలన్నారు. రాష్ట్రంలో వైఎస్‌.జగన్మోహన్‌రెడ్డిని ముఖ్యమంత్రిని చేసేందుకు సోషియల్‌ మీడియా మరింతగా ముందుకురావాలని పిలుపునిచ్చారు. ఆకేపాటి అమరనాథరెడ్డి , ఎమ్మెల్యే శ్రీనివాసులు మాట్లాడుతూ వైఎస్సాఆర్సీపి సోషియల్‌ మీడియా విభాగం చురుగ్గా పని చేస్తోందన్నారు. ఈ విభాగం మరింతగా కృషి చేసి, వైఎస్సాఆర్సీపి నవరత్నాలను ప్రజల్లోకి మరింతగా చేర్పించే భాధ్యతను తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సాఆర్సీపి రాష్ట్ర కార్యదర్శులు పెద్దిరెడ్డి, రెడ్డెప్ప, పోకల అశోక్‌కుమార్‌, కొండవీటి నాగభూషణం, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి అక్కిసాని భాస్కర్‌రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి నాగరాజారెడ్డి, ఆర్టీసి మజ్ధూర్‌ అధ్యక్షుడు జయరామిరెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఇఫ్తికార్‌, మున్సిపల్‌ వైస్‌ చైర్మన్‌ అమరేంద్ర, మున్సిపల్‌ ఉద్యోగ కార్మిక సంఘ అధ్యక్షుడు ఫకృద్ధిన్‌షరీఫ్‌, కౌన్సిలర్లు త్యాగరాజు, మనోహర్‌, అమ్ము, పెద్దిరెడ్డి యువజన సంఘ నాయకులు రాజేష్‌, తుంగా మంజు, సురేష్‌, కుమార్‌, జెపియాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

నేడే వ్యక్తిత్వ వికాసం , ప్రేరణపై సదస్సు

Tags:Make people aware of the social media through social media – Emmel Peddireddy

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *