కన్నడ కంఠీరవుడు చిత్రపటంతో మల్లన్న దర్శనం

– అభిమాన నటుడు చిత్రపటంతో శ్రీగిరి కు పాదయాత్ర
కర్నూలు ముచ్చట్లు:
 
అభిమానానికి అవధులేవన్నట్లుగా కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ అభిమానులు చాటిచెప్పారు. ఎంతోమంది కన్నడ అభిమానుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిన కన్నడ సూపర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ చిత్రపటం చేతపట్టుకొని కన్నడ అభిమానులు పాదయాత్రగా మల్లన్న దర్శనానికి బయల్దేరారు.ఈ సందర్భంగా కన్నడ అభిమానులు మాట్లాడుతూ నిరుపేద ప్రజల క్షేమం కోసం తీవ్రంగా కృషి చేసిన మహోన్నత వ్యక్తి అని,ఎంతోమంది అనాధ పిల్లలకు తోడుగా ఉంటూ ఉన్నత విద్యలు చదివిస్తూ వారి క్షేమం కొరకు ఎంతో కృషి చేశాడని వారు తెలియజేశారు.అంత గొప్ప వ్యక్తి మన మధ్య లేకపోవడం చాలా బాధాకరమని వారు విచారం వ్యక్తం చేశారు.పునీత్ రాజ్ కుమార్ అభిమానులుగా ఆయన అభిమానాన్ని చాటుకోవడానికి పాదయాత్రగా శ్రీశైలం చేరుకుంటున్నామని వారు తెలియజేశారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకొని సమాజాన్ని మెరుగుపరుచుకోవాలని అభిమానులు తెలియజేశారు.
 
Tags: Mallanna darshanam with Kannada Kanthiravadu movie

Natyam ad