కరుణలేక పార్టీ వీడనున్న మమత -తెలుగుదేశంలో చేరేందుకు సిద్ధం

తిరుపతి ముచ్చట్లు:
వైఎస్‌ఆర్‌ సీపీ రాష్ట్ర మహిళ విభాగం జనరల్‌ సెక్రటరీ బోయనపాటి మమత త్వరలో తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైంది. పార్టీ ప్రధాన కార్యదర్శి కరుణాకర్‌ రెడ్డి ఆధ్వర్యంలో మమత పార్టీలో చురుగ్గా పాల్గొంటు పార్టీ కోసం లక్షలాది రుపాయలు ఖర్చు చేశారు. త్వరలో జరగనున్న తిరుపతి కార్పోరేషన్‌ ఎన్నికల్లో మేయర్‌ కావాలని ఆశలు పెట్టుకున్నారు. ఇలాంటి సమయంలో మమతను కాదని తిరుపతి తెలుగుదేశం పార్టీలో ఉన్న డాక్టర్‌ ఆశాలతకు మేయర్‌ టికేట్టు ఇచ్చేందుకు రంగం సిద్ధమైనట్లు ప్రచారం సాగుతోంది. పార్టీ నేతల ఇచ్చిన హామీలు అడియాశలు కావడంతో మమత కినుక వహించారు. పార్టీ కోసం కష్టపడి పనిచేస్తున్న వారిని కాదని కొత్త వారిని చేర్చుకోవడాన్ని ఆమె జీర్ణించుకోలేకపోయారు. ఈ మేరకు చిత్తూరు ఎమ్మేల్సీ బీఎన్‌ రాజసింహులు చర్చలు జరిపారు. ఆయన ఆధ్వర్యంలొ బోయనపాటి మమత తెలుగుదేశం పార్టీలో చేరేందుకు రంగం సిద్ధమైనట్లు సమాచారం. మమత పార్టీ వీడీపోతే వైఎస్‌ఆర్‌సీపీకి కోలుకోలేని దెబ్బ పడుతుందని తిరుపతి మేధావి వర్గం వాపోతోంది.

Tag: Mamata, who is in favor of the party, prepare to join the country


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *