రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
ఏలూరు ముచ్చట్లు:
పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెం మండలం తాడువాయి పంచాయితీ జల్లేరు చిన్న వాగు వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ముందు వెళుతున్న ద్వి చక్ర వాహనాన్ని లారీ వెనకనుంచి ఢీ కొట్టింది. ఈ ఘటనలో తలారి కాంతారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సీతయ్యకు గాయాలు అయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు.
Tags; Man killed in road accident