మావోయిస్టు దంపతుల లొంగుబాటు

Date:09/10/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
హైదరాబాద్ పోలీసు కమిషనర్ అంజనీ కుమార్ మందు  మావోయిస్టులు కోటి పురుషోత్తం అలియాస్ విజయ్ అలియాస్ శరత్ చంద్ర, .కోటి వినోదిని అలియాస్ విజయ లక్ష్మి లు బుధవారం లొంగిపోయారు.  ఈ సందర్బంగా సిపి అంజనీ కుమార్ మాట్లాడుతూ సిపిఐ మావోయిస్తు  పార్టీ లో వీళ్ళు పని చేసారు. టాప్ క్యాడర్ లో పురుషోత్తం ఉన్నాడు ఇతని పై 8లక్షల రివార్డు ఉంది. 1974 పురుషోత్తం బ్యాచిలర్ ఆఫ్ ఓరియంటల్ లాంగ్వేజ్, , 1987లో  ఎమ్ఏ  చదివాడు.
పురుషోత్తం సాధారణ మధ్య తరగతి కుటుంబానికి చెందినవాడు. మావోయిస్టు లో చేరిన తరువాత పురుషోత్తం అంబెడ్కర్ విద్యానికేథన్ అప్పర్ ప్రైమరీ స్కూల్ లో హెడ్ మాస్టర్ గా పని చేసారు. 1982లో పురుషోత్తం వినోదిని ని వివాహం చేసుకున్నాడు. వినోదిని కూడా అడ్డగుట్ట ఏరియాలో టీచర్ గా పనిచేసే వాళ్ళని అయన అన్నారు. మావోయిస్టు పురుషోత్తం మాట్లాడుతూ మా అనారోగ్యం కారణంగా మేము లొంగిపోయాం.  1975 నుంచి ఆస్తమా ఉంది అందుకే లొంగిపోయాం.  పార్టీ నాయకత్వం అనేది సరిగ్గా లేదు.
గత రెండు సంవత్సరాలుగా పార్టీలో మాకు స్థానం లేకుండా చేశారని అన్నారు.  సెంట్రల్ కమిటీ కూడా మా సమస్యలను తీసుకెళ్లినా పట్టించుకోలేదు.  గత 10 సంవత్సరాలుగా చాలా ఇబ్బందులు ఎదురుకున్నాం.  గణపతి తో కలిసి చాలా సంవత్సరాలు పని చేసాం.  మానవ సంబంధాలు పార్టీలో దూరం అయ్యాయని అన్నారు.  పార్టీలో యువత తగ్గిపోయింది. ఎంత కాలం యువత లేకుండా పార్టీని లీడ్ చేస్తామని అన్నారు.
తెలంగాణ రావడం అనేది కూడా మా లొంగుబాటుకు ఒక కారణమని అన్నారు.  ఎకానమీ పెరిగింది గ్రామ ప్రజలకు అనేక పథకాలు అందుతున్నాయి. రామకృష్ణ ఎదుటి వాళ్ళను పైకి రానివ్వరు. రామకృష్ణ పార్టీలో అసమర్థుడు. ఎమ్మెల్యేలను చంపడం అనేది చాలా తప్పని అయన అన్నారు. వినోదిని మాట్లాడుతూ మేము ప్రత్యేక్షంగా దాడుల్లో పాల్గొనలేదు. అరెస్ట్ అయ్యాక నల్లమల్ల అడవుల్లో వెళ్ళాం, ప్రచార ల కార్యక్రమాల్లో మా పాత్రను తగ్గించారు. నా ఆరోగ్యం క్షించిన తరువాత నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదని అన్నారు.
Tags: Maoist couple’s surrender

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *