మార్చి9 చారిత్రాత్మక రోజు = ఎమ్మెల్సీ కవిత

 
తెలంగాణ ముచ్చట్లు:
తెలంగాణ చరిత్రలో మార్చి9 చారిత్రాత్మక రోజు అని ఎమ్మెల్సీ కవిత అభివర్ణించారు. ఈ సందర్భంగా ఆమె టీవీ9తో మాట్లాడారు. ’80వేల కు పైగా ఉద్యోగాల భర్తీకి ప్రకటన చేసినందుకు ముఖ్యమంత్రి కేసీఆర్‌ కు ధన్యవాదాలు. 95 శాతం ఉద్యోగాలు స్థానికులకే కేటాయించడం హర్షణీయం. బీజేపీ,కాంగ్రెస్ నాయకులు అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు. దేశంలో2 కోట్ల ఉద్యోగల భర్తీ చేస్తామన్న బీజేపీ ఎందుకు మాట తప్పిందో సమాధానం చెప్పాలి. నిరుద్యోగులు విపక్షాల ట్రాప్ లో పడి కోర్టు లకు వెళ్లొద్దు. నిరుద్యోగ భృతి పై కూడా త్వరలోనే నిర్ణయం తీసుకుంటాం’ అని కవిత చెప్పుకొచ్చారు.
 
Tags:March 9 is a historic day = Emelsie Poetry

Natyam ad