నష్టాల్లో మార్కెట్లు

Date:19/06/2018
ముంబై ముచ్చట్లు:
వ‌రుసగా రెండో రోజైన మంగ‌ళ‌వారం స్టాక్ మార్కెట్లు న‌ష్టాల‌తో ముగిశాయి. అంత‌ర్జాతీయంగా ప్ర‌తికూల ప‌రిణామాలు నెల‌కొన‌డంతో దేశీయ మార్కెట్ల‌పై ఆ ప్ర‌భావం ప‌డింది. ట్రేడింగ్ ముగిసే స‌రికి బీఎస్ఈ సెన్సెక్స్ 261.52 పాయింట్లు కోల్పోయి 35,286 వ‌ద్ద ముగియ‌గా మ‌రో సూచీ నిఫ్టీ 89.40 పాయింట్లు క్షీణించి 10,710.45 వ‌ద్ద స్థిర‌ప‌డింది. బీఎస్ఈ సెన్సెక్స్ సూచీలో 30 కంపెనీల్లో ఐటీసీ(0.76%), ఓఎన్జీసీ(0.30%), హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్(0.24%), హెచ్‌డీఎఫ్‌సీ(0.13%) మాత్ర‌మే లాభ‌ప‌డ‌గా , మ‌రో వైపు వీఈడీఎల్(3.55%), అదానీ పోర్ట్స్(2.00%), ఎం అండ్ ఎం(1.94%), రిల‌య‌న్స్(1.91%), ఇండ‌స్ఇండ్ బ్యాంక్(1.90%) అత్య‌ధికంగా న‌ష్ట‌పోయాయి.
Tags:Markets in distress

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *