కాషాయ హవాతో మార్కెట్ల జోరు.

ముంబై ముచ్చట్లు:
దేశంలోని ఐదు రాష్ట్రాల్లో ఎన్నికలు పూర్తై ఎగ్జిట్ పోల్స్ వెలువడడం మార్కెట్లకు దన్నుగా నిలిచింది. ఇదే సమయంలో కాషాయ పార్టీహవా ఇన్వెస్టర్లలో దైర్యాన్ని నింపడంతో సూచీలు జోరందుకున్నాయి. దలాల్ స్ట్రీట్ లో బుల్ జోరు కొనసాగడంతో ప్రధానంగా బ్యాంకింగ్ రంగం ఊపందుకుంది. బ్యాంక్ నిఫ్టీ సూచీ ఏకంగా 1500 పాయింట్లు పెరుగుదలను నమోదు చేసింది. అంతకు ముందు రెండు వారాల పాటు రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పెరిగిన ద్రవ్యోల్బణం, అంతర్జాతీయ మార్కెట్ల అనిశ్ఛితి వంటి అనేక కారణాలతో భారత స్టాక్ మార్కెట్లు వరుసగా నష్టాలతో పతనమయ్యాయి. ఈ కాలంలో అత్యధికంగా మదుపరుల సంపద 25 లక్షల కోట్ల వరకు ఆవిరైంది. ఇదే సమయంలో విదేశీ మదుపరుతు సైతం భారీగా మన మార్కెట్ల నుంచి తరలిచడంతో పరిస్థితి దారుణంగా మారింది. కానీ.. నేడు వీటన్నిటినీ దాటుకుని కౌంటింగ్ ప్రారంభం కావటం వల్ల.. మార్కెట్లు ప్రారంభంలోనే భారా గ్యాప్ అప్ తో ప్రారంభమయ్యాయి.ఇదే సమయంలో నిన్న చల్లబడ్డ క్రూడ్ ఆయిల్, బంగారం ధరలు మళ్లీ నేడు పుంజుకున్నాయి. యూరోపియన్ దేశాలు తమ అవసరాల కోసం రష్యా నుంచి గ్యాస్, చమురును దిగుమతి చేసుకోవడాాన్ని పూర్తిగా నిపివేసేందుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం కాకపోవటం కూడా దీనికి మరో కారణంగా చెప్పుకోవాలి. రష్యా నుంచి ఇంధన దిగుమతులు బాయ్ కాట్ చేయాలని నిర్ణయించినప్పటికీ అది ఇప్పుడప్పుడే అసాధ్యంగా కనిపిస్తోంది.నిన్న ఆరంభంలో బ్యారెల్ క్రూడ్ ఆయిల్ ధర 124.66 డాలర్లు ఉండగా.. సాయంత్రానికి 108.70 వద్ద ముగిసింది. అంటే 16 డాలర్లు మేర తగ్గింది. గానీ నేడు మళ్లీ క్రూడ్ ధర స్వల్పంగా పెరిగింది. ప్రస్తుతం బ్యారెల్ 110 డాలర్లకుపైగా ఉంది.
 
Tags:Markets thrive with amber air

Natyam ad