వివాహేతర సంబంధమే హత్యకు దారితీసింది

Date:13/02/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
నగరంలో సంచలనం సృష్టించిన గర్భిణి హత్య కేసులో నిందితులను హైదరాబాద్ పోలీసులు మంగళవారం నాడు మీడియా ఎదుట ప్రవేశపెట్టారు. కేసును దర్యాప్తు చేసిన పోలీసులు సీసీ పుటేజీ ఆధారంగా నిందితులను పట్టుకున్నారు.  నిందితులు మమతా ఝా, అనిల్ ఝా, అమర్కాంత్ ఝా, వికాస్ కశ్యప్ కలిసి గర్భిణి పింకిని అతి కిరాతకంగా హత్య చేసినట్లు పోలీసులు చెప్పారు. మొదట హత్య చేసి రంపంతో ముక్కలు ముక్కలుగా కోసి చంపినట్లు పోలీసులు చెప్పారు. హత్య చేశాక మరుసటి రోజున గోనెసంచిలో మృతదేహాన్ని పెట్టి బొటానికల్ గార్డెన్ దగ్గర పడేశారు. వివాహేతర సంబంధాలే హత్యకు కారణమని పోలీసులు వెల్లడించారు.గత నెల 29న వెలుగులోకి వచ్చిన గర్భిణీ హత్య కేసు నిందితులను సీసీ ఫుటేజీ ఆధారంగా గుర్తించామని సైబరాబాద్ సీపీ సందీప్ శాండిల్య అన్నారు. హత్య తర్వాత మృతదేహాన్ని ముక్కలుగా కోసి సంచిలో పెట్టి బొటానికల్ గార్డెన్ వద్ద పడేశారని వివరించారు. 150 సీసీ కెమెరాల్లో పుటేజ్ పరిశీలించామని, మడ్ గార్డ్ లేని వాహనం, బ్లూ కలర్ టీషర్ట్ నిందితుడ్ని పట్టించాయనిఅయన అన్నారు. మృతురాలు బీహార్ కు  చెందిన పింకీకి 15 ఏళ్ల క్రితం దినేష్ అనే వ్యక్తితో వివాహం జరిగిందని, ఆ తర్వాత 2017లో అతని నుంచి విడిపోయి వికాస్ తో  సహజీవనం చేసిందని వివరించారు. వికాస్ కొంతకాలం పింకీతో ఉండి ఆ తర్వాత హైదరాబాద్ వచ్చేశాడని, హైదరాబాద్ లో  అమర్ కాంత్ ఝా కుటుంబంతో కలిసి ఉంటున్నాడని వివరించారు. వికాస్ ను  వెతుక్కుంటూ పింకీ కూడా హైదరాబాద్ వచ్చిందన్నారు. ఇక్కడికి వచ్చాక అమర్ కాంత్ ఝా తల్లి మమతా ఝాతో వికాస్ కు  ఉన్న వివాహేతర సంబంధాన్ని పింకీ ప్రశ్నించింది. గొడవ జరగడంతో పింకీ దవడపై మమతా ఝా కొట్టిందని, మమతా ఝా కొట్టిన దెబ్బలతో పింకి చనిపోయిందని తెలిపారు. ఈ హత్యకు మమతా ఝా భర్త అనిల్ ఝా, కుమారుడు అమర్ కాంత్  ఝా సహకరించారని వివరించారు. హత్య అనంతరం పింకి మృతదేహాన్ని ఎలక్ట్రికల్ కట్టర్ తో  ముక్కలు ముక్కలు చేశారని వివరించారు.
Tags: Marriage relationship has led to murder

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *