వివాహిత అనుమానస్పద మృతి

-బంధువుల రాస్తారోకో
 
విజయవాడ ముచ్చట్లు:
 
విజయవాడ అజిత్ సింగ్ నగర్ ఫ్లై ఓవర్ వద్ద ఓ వివాహిత తమ్మల సాయిజ్యోతి మృతికి నిరసనగా బంధువులు అకస్మాత్తుగా రాస్తారోకో చేసారు. దేవినేని గాంధీ పురం వద్ద ఓ వివాహిత అనుమానాస్పద మృతి చెందింది. అత్తింటి సభ్యులే చంపారని మృతురాలి బంధువులు ఆరోపించారు. ఆత్మహత్యగా చిత్రీకరించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని అన్నారు. దినపత్రికలలో తప్పుడు కథనం ఇచ్చారంటూ ఆరోపించారు. రాస్తారోకో కారణంగా  ట్రాఫిక్ నిలిచిపోయింది. పోలీసుల జోక్యంతో మృతురాలి బంధువులు ఆందోళన విరమించారు.
 
Tags; Married suspicious death

Natyam ad