15న ప్రారంభంకానున్న మసెమ్మ జాతర

పుంగనూరు ముచ్చట్లు:
 
పుంగనూరు మండలం ఆరడిగుంట పంచాయతీ కొండచెర్ల కురప్పల్లె గ్రామంలో ఈనెల 15, 16 రెండు రోజుల పాటు మసెమ్మ జాతర జరగనున్నది. ఈ మేరకు గురువారం గ్రామస్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. అమ్మవారి ఆలయాన్ని అత్యంత సుందరంగా అలంకరించారు. రెండు రోజుల పాటు నిర్వహించే జాతరలో అమ్మవారికి తొలి పూజలను ఆచారం ప్రకారం వడ్డిబోయుల కులస్తులు చేస్తారు. గ్రామంలోని కుంటిగంగమ్మ , దనకుంట గంగమ్మ, బోయకొండ గంగమ్మ , నడివీధి గంగమ్మలకు పూజలు నిర్వహించి, పుర వీధుల్లో బళ్లారి డ్రమ్ములు, మేళతాళాలు , నృత్యాలు, పిల్లన గ్రోవి , చక్క భజనలు , కర్రసాము, వెహోదలైన కార్యక్రమాల నడుమ అంగ రంగ వైభవంగా అమ్మవారిని ఊరేగింపు చేసి 16న భక్తుల దర్శనార్థం అమ్మవారిని మసెమ్మ ఆలయం వద్ద నిలుపుతారు. ఈ పూజా కార్యక్రమాలలో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డితో పాటు 30 గ్రామాలకు చెందిన వేలాది మంది భక్తులతో పాటు ఆంధ్ర, కర్నాటక ప్రజలు హాజరై అమ్మవారికి వెహోక్కులు చెల్లించుకుంటారు.
 
Tags: Masemma Jatara which will not start on the 15th
 

Natyam ad