కోటప్పకొండ లో సామూహిక అక్షరాభ్యాసం 

Date:18/06/2018
గుంటూరు ముచ్చట్లు:
కోటప్పకొండ పుణ్యక్షేత్రంలో సామూహిక అక్షరాభ్యాసం కార్యక్రమంలో ఏపీ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పాల్గొన్నారు. ఈ సందర్బంగా అయన పలువురు చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించారు. తరువాత అయన మాట్లాడుతూ మేధా దక్షిణామూర్తిగా కోలువుతీరిన త్రికోటేశ్వరుని సన్నీదిలో చిన్నారులతో అక్షరాభ్యాసం చేయించడం  సంతోషంగా ఉంది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో బాసరకి అక్షరాభ్యాసంకలో  ఎంతటి ప్రాధాన్యత ఉందో నూతన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ ప్రాంతానికి అంతటి ప్రాధాన్యత సంతరించుకుందని అన్నారు. మేధా దక్షిణామూర్తిగా కోలువుతీరిన త్రికోటేశ్వరుడు కోన్ని వందల సంవత్సరాల నుండి ఇక్కడి బక్తులకు దర్శనం ఇస్తున్నారు. అప్పటి నుండి మేధా దక్షిణామూర్తి దయతో ఈ ప్రాంతం సుభిక్షంగా ఉందని అన్నారు. ఈ రోజు ఇక్కడ కులమతాలకు అతీతంగా అందరూ కలసి సామూహికంగా అక్షరాభ్యాసం చేసుకోవడం సంతోషంగా ఉంది. గతంలో జన సంచారం పెద్దగాలేని ఈ ప్రాంతం నేడు మనం చేసుకున్న అభివృద్ధితో నిత్యం వేలాది మంది బక్తులు, పర్యాటకులతో రద్దీగా ఉంటుందని అన్నారు. భవిష్యత్ లో ఈ ప్రాంతం మరింత అభివృద్ధి చెందుతుంది. డిశంబర్ నాటికి ఇక్కడ రోప్-వే పూర్తవుతుంది.  అప్పుడు మరింత పర్యాటకం పెరుగుతుంది. గతంలో ప్రభుత్వం చేసిన బీచ్ పెస్టివల్ లాగా డిశంబర్ లో ఇక్కడ హిల్ పెస్టివల్ నిర్వహిస్తామని వెల్లడించారు. టూరిజం, ఆధ్యాత్మికంగా ఈ ప్రాంతం అభివృద్ధి చేయడమే హిల్ పెస్టివల్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ పెస్టివల్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా కావలసిన సమాచారం తెలుస్తోందని అన్నారు. మేధా దక్షిణామూర్తి అత్యంత తెలివైన దేవుడు కాబట్టే ఇక్కడ అక్షరాభ్యాసంకు అంతటి ప్రాధాన్యత అని అన్నారు.
Tags:Mass introduction in Kottappakonda

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *