High yields with micro nutrients: CM Chandrababu

మక్కా మసీదు పేలుళ్ల కేసు..

-నిందితులు నిర్దోషులు
Date:16/04/2018
హైదరాబాద్  ముచ్చట్లు:
మక్కా మసీదు పేలుళ్ల కేసులో మరికాసేపట్లో ఎన్ఐఏ ప్రత్యేక న్యాయస్థానం తుది తీర్పు వెలువరించింది. 2007లో జరిగిన దుర్ఘటన కేసును 11 ఏళ్ల విచారణ తర్వాత న్యాయస్థానం తీర్పు వెల్లడించింది. . మొత్తం 10 మంది నిందితుల్లో ఒకరి హత్య జరగగా, ఏడుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. మరో ఇద్దరు నిందితులు పరారీలో ఉన్నారు. ప్రతీకారంతో పేలుళ్లు జరిగాయని అభియోగపత్రాలు దాఖలయ్యాయి. సుధీర్ఘ వాదోపవాదాల తరువాత నిందితులైన అసీమానంద, భరత్, దేవేందర్ గుప్తా, రాజేందర్, లోకేశ్ శర్మలపై అభియోగాలు రుజువు కానందున వారిని నిర్దోషులుగా కోర్టు ప్రకటించింది. అంతకుముందు వారిని చర్లపల్లి సెంట్రల్ జైలునుంచి గట్టి భద్రతామధ్య కోర్టుకు తరలించారు. ఈ  కేసు తీర్పు  నేపథ్యంలో   పోలీసులు నాంపల్లి కోర్టు, పాతబస్తీ ప్రాంతాల్లో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు. ఈకేసు తీర్పు ను న్యాయమూర్తి రెండు నిముషాల్లోనే తీర్పు వెల్లడించడం విశేషం.  కేసులో మిగిలిన నిందితులపై కేసు కొనసాగుతుందని కేసులో వాదించిన ఒక న్యాయవాది చెప్పారు. నేడు ఐదుగురు నిందితులను నిర్దోషులుగా కోర్టు ప్రకటించిందని ఆయన అన్నారు. ఏ ఒక్కరిపైనా అభియోగాలు రుజువు కాలేదని ఆయన చెప్పారు.2007 మే 18న మధ్యాహ్నం  హైదరాబాద్ చార్మినార్ సమీపంలోని మక్కామసీదు ఆవరణలో ప్రార్థనలు జరుగుతున్న వేళ, వజూఖానా వద్ద ఐఈడీ (ఇంప్రోవైజ్డ్ ఎక్స్ ప్లోజివ్ డివైస్) బాంబును పేల్చడంతో, తొమ్మిది మంది అక్కడికక్కడే మరణించారు.  మరో 58 మంది గాయపడ్డారు. మసీదు కు సమీపంలోనే పేలని మరో ఐఈడీని పోలీసులు నిర్వీర్యం చేసారు. ఘటనపై స్థానిక ముస్లింలు నిరసనలు తెలుపుతుండగా, వాటిని అడ్డుకునేందుకు పోలీసులు జరిపిన కాల్పుల్లో ఐదుగురు మరణించారు.
నిందితుల్లో దేవేంద్రగుప్తా అలియాస్ బాబీ  రాజస్థాన్కు చెందినవాడు రాగా , లోకేశ్ శర్మ అలియాస్ అజయ్ తివారి మధ్యప్రదేశ్కు,  కీలక నిందితుడు నాటకుమార్ సర్కార్ అలియాస్ స్వామి అసిమానంద  గుజరాత్ కు చెందిన వారు. గుజరాత్ లోని వల్సాద్ కు చెందిన భారత్ మోహన్ లాల్ రతేశ్వర్ అలియాస్ భారత్ భాయిని, మధ్యప్రదేశ్ కు చెందిన రాజేందర్ చౌదరి అలియాస్ సముందర్ లను తరువాత పోలీసులు  అరెస్ట్ చేశారు. సందీప్ వి డాంగే, రామచంద్ర కల్సంగ్రా రాంజీ అలియాస్ ఓమ్ జీలు ఇప్పటికీ పట్టుబడలేదు. మరో కీలక నిందితుడు సునీల్ జోషి ని గుర్తు తెలియన వ్యక్తులు హతమార్చారు.తొలుత హుస్సేనిఆలం పోలీస్స్టేషన్ పరిధిలో ఈ కేసు నమోదై దర్యాప్తు ప్రారంభమైంది. కేసు విచారణలో ఎలాంటి పురోగతి లేకపోవడంతో సీబీఐకి బదిలీ చేస్తూ అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చివరకు కేసు దర్యాప్తును 2011 ఏప్రిల్లో ఎన్ఐఏకు అప్పగించారు.
Tags:Mecca Masjid blast case

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *