Date;13/04/2018
హైదరాబాద్ ముచ్చట్లు:
తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు బెంగళూరు కు బయలుదేరారు. ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సన్నాహకాలలో భాగంగా ఆయన నేడు బెంగళూరులో పర్యటిస్తున్నారు. ఈ పర్యటనలో ఆయన మాజీ ప్రధాని దేవెగౌడతో సమావేశం అవుతారు. దేశ రాజకీయ పరిస్థితులు, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు సహా సహా పలు అంశాలపై ఇద్దరు నేతలు చర్చిస్తారు. బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, జార్థండ్ మాజీ సీఎం హేమంత్ సోరెన్ తో ఇటీవల జరిగిన చర్చల వివరాలను దేవేగౌడకు కేసీఆర్ వివరిస్తారు. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాలకు కావాల్సిన సరికొత్త పాలసీని ఎలా రూపొందించాలన్న దానిపైనా మీటింగ్‌లో ఇద్దరు నేతలు చర్చించే అవకాశాలున్నాయి. ఫెడరల్ ఫ్రంట్ దిశగా అడుగులు వేస్తున్న కెసిఆర్ మార్చి నెలలో కోల్‌కతా వెళ్ళి పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతాబెనర్జీతో భేటీ అయ్యారు. బిజెపి.. కాంగ్రెసేతర ఫ్రంట్ దేశ రాజకీయాల్లో తీసుకువస్తానని సంచలన ప్రకటన చేసిన కెసిఆర్ తన ప్రణాళికను, ఆలోచనలను ఆమెతో పంచుకున్నారు.ఇప్పుడున్న పరిస్థితుల్లో దేశానికి ఫెడరల్ ఫ్రంట్ అవసరమని అన్నారు. కెసిఆర్ ఆలోచనలు, అభిప్రాయాలతో ఏకీభవిస్తున్నట్లు మమతాబెనర్జీ ప్రకటించారు. అ తర్వాత కుడా మమతాబెనర్జీ, కెసిఆర్‌లు వివిధ అంశాలపై తమ అభిప్రాయాలు పంచుకుంటున్నారు. ఆ జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ హైదరాబాద్ వచ్చి కెసిఆర్ ను ప్రగతిభవన్ లో కలిశారు. అయన కుడా కేసిఆర్ ఫ్రంట్ కు మద్దతు తెలిపారు. తర్వాత ఒడిస్సా సిఎం నవీన్ పట్నా యక్ తో భేటీ కావాలని కెసిఆర్ భావి స్తున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
Tags:Meet the KCR with former Prime Minister Deve Gowda