Meet the TPC leaders with Rahul

రాహుల్ తో టీపీసీసీ నేతల భేటీ

Date:14/09/2018
న్యూఢిల్లీ ముచ్చట్లు:
తెలంగాణ కాంగ్రెస్ నేతలతో ఐసీసీ అధ్యక్షుడు రాహుల్ గాంధీతో శుక్రవారం భేటీ అయ్యారు. ప్రధానంగా తెలంగాణ ఎన్నికల్లో పొత్తు విషయంపై చర్చించారు. టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు 50 మంది టికాంగ్రెస్ నేతలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.  తెలంగాణలోని అన్ని నియోజకవర్గాల వారీగా గెలుపు గుర్రాలపై ఆరా తీసిన ఉత్తమ్ ఆ జాబితాను ఈ భేటీలో రాహుల్ ముందు ఉంచినట్లు సమాచారం.
భేటీలో రాహుల్ మాట్లాడుతూ తెలంగాణలో పొత్తులు, అభ్యర్థుల విషయంలో ఎవరూ బాహాటంగా మాట్లాడవద్దని సూచించారు. విజయం సాధించే వారినే బరిలోకి దింపుదామని ఆయన చెప్పారు. అభిప్రాయ భేదాలుంటే పార్టీ వేదికగా చర్చించుకోవాలని ఆయన అన్నారు. భక్తి చరణ్దాస్ ఛైర్మన్గా ముగ్గురు సభ్యులతో తెలంగాణ  స్క్రీనింగ్ కమిటీని రాహుల్ గాంధీ  ఏర్పాటు చేశారు.
కమిటీలో సభ్యులుగా జ్యోతిమని సెంథిమలై, శర్మిష్ఠ ముఖర్జీ, లున్నారు.నిర్మాత, నటుడు బండ్ల గణేష్, శుక్రవారం కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఢిల్లీలో బండ్ల గణేష్ ను తెలంగాణ కాంగ్రెస్ నేతలు రాహుల్ కు పరిచయం చేయగా, గణేష్ ను పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్టు రాహుల్ తెలిపారు.  టీఆర్ఎస్ ఎమ్మెల్సీ భూపతి రెడ్డి కూడా కాంగ్రెస్ పార్టీలో చేరారు.
సమావేశం తరువాత టీపీసీసీ ఛీఫ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీతో పొత్తుకు ఏఐసీసీ అధ్యక్షుడు రాహుల్ అంగీకరించినట్లు అయన వెల్లడించారు. తెలంగాణ ఎన్నికల కోసం కాంగ్రెస్ త్రిసభ్య కమిటీ పర్యటించనుందని, సీట్ల సర్దుబాటు, అభ్యర్థుల ఎంపిక తదితర విషయాలను కమిటీ చూసుకుంటుందని రాహుల్ చెప్పినట్లు ఉత్తమ్ అన్నారు.
Tags: Meet the TPC leaders with Rahul

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *