ఫిబ్రవరి 2న సమావేశం

విజయవాడ ముచ్చట్లు:
 
ఏపీలో సినిమా టిక్కెట్ రేట్ల విషయం ఇంకా ఓ కొలిక్కి రాలేదు. సంక్రాంతి సీజన్ లో విడుదల కావాల్సిన పాన్ ఇండియా చిత్రాల విడుదల వాయిదా పడటంతో ప్రభుత్వం కూడా ఈ విషయమై నింపాదిగానే నిర్ణయం తీసుకొనేలా కనిపిస్తోంది. పలువురు ఎగ్జిబిటర్స్, డిస్ట్రిబ్యూటర్స్ తో పాటు దర్శక నిర్మాతలు ఆర్. నారాయణమూర్తి, రామ్ గోపాల్ వర్మ వంటి వారు ఏపీ సినిమాటోగ్రఫీ శాఖామంత్రి పేర్ని నానిని వ్యక్తిగతంగా కలిసి తమ వాదన వినిపించారు. అలానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి పిలుపు మేరకు చిరంజీవి ఆయన్ని ఇంటిలో కలిసి, విందు చేసి, చిత్రసీమ సమస్యలను ఏకరువు పెట్టారు. ఆ సందర్భంగా ప్రభుత్వం వైపు నుండి ఎలాంటి ప్రకటన రాకపోయినా, చిరంజీవి మాత్రం టిక్కెట్ రేట్ల విషయంలో ప్రభుత్వం సానుకూలంగానే స్పందిస్తుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. ఇదిలా ఉంటే మార్చి నెల నుండి భారీ బడ్జెట్ చిత్రాలు వరుసగా విడుదల కావచ్చునని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఏపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన సినిమా టిక్కెట్ రేట్ల పరిశీలన కమిటీ మూడోసారి ఫిబ్రవరి 2న సమావేశం కాబోతోంది. ఇప్పటికే డిసెంబర్ 31, జనవరి 11 తేదీలలో కమిటీ రెండుసార్లు సమావేశమైంది. అయితే కమిటీలోని డిస్ట్రిబ్యూటర్స్, ఎగ్జిబిటర్స్ సినిమా టిక్కెట్ రేట్లను నగర పంచాయితీలు, గ్రామ పంచాయితీలలో పెంచాలని కోరుతున్నట్టు తెలుస్తోంది.
దాడులను అరికట్టాలి
Tags: Meeting on February 2nd

Natyam ad