భవిష్యత్తు కలవర పాటులో మెగా కాంపౌండ్!

హైదరాబాద్‌ ముచ్చట్లు:

మహేష్ మురగదాస్ కాంబినేషన్‌లో వచ్చే సంవత్సరం ప్రారంభం కాబోతున్న భారీ సినిమా ఇంకా ప్రారంభం కాకుండానే ఆ న్యూస్ మెగా కాంపౌండును కలవర పాటులో పడేసింది అన్న వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్న ఎస్వీ ప్రసాద్, ఠాగూర్ మధు తీసుకున్న నిర్ణయం అని అంటున్నారు. చిరంజీవికి అత్యంత ఆత్మీయులైన వీరిద్దరు మహేష్‌తో 100 కోట్ల రూపాయల విలువైన భారీ సినిమాను తీస్తూ ఉండటమే కాకుండా ఈ సినిమాకు సంభందించి మహేష్‌కు 25 కోట్ల పారితోషికం ఆఫర్ చేయడం కూడా మెగా కుటుంబానికి ముఖ్యంగా చిరంజీవి, రామ్‌చరణ్‌లకు షాకింగ్‌గా మారింది అనే వార్తలు వస్తున్నాయి. చిరంజీవి మెగా స్టార్‌గా మారడానికి ఎన్టీఆర్‌కు వీర విధేయులుగా ఉన్న అశ్వనీదత్, దేవీ వరప్రసాద్, త్రివిక్రమరావు నిర్మించిన భారీ సినిమాలు ఎంతగానో ఉపయోగపడ్డాయి. చిరంజీవి సినిమాల మార్కెట్‌ను అదేవిధంగా చిరంజీవి పారితోషికం పెరగడంలో ఈ నిర్మాతలు ఆరోజులలో ఎంతో సహకరించారు అనే వార్తలు ఉన్నాయి. అలాగే ఎస్వీ ప్రసాద్, ఠాగూర్ మధు చిరంజీవికి వీర విధేయులుగా ఉండటమే కాకుండా మెగా కాంపౌండ్‌కు సొంత మనుషులులా ప్రవర్తిస్తూ వచ్చారు. అయితే ఇప్పుడు వీరద్దరు కలిసి మహేష్‌తో భారీ సినిమాను తీస్తూ ఉండటంతో నెమ్మదిగా మెగా కాంపౌండ్ నిర్మాతలు అంతా మహేష్ నిర్మాతలుగా మారిపోతారా అనే అనుమానం మెగా కాంపౌండ్‌ను వెంటాడుతోంది అని టాక్. ఈ పరిస్థితులు ఇలా మారి పోవడానికి రామ్‌చరణ్ తన నిర్మాతలతో వ్యవహరిస్తున్న తీరుకూడా కారణం అనే మాటలు విని పిస్తున్నాయి. ‘బ్రూస్ లీ’ ఘోర పరాజయం తరువాత రిలాక్స్ కావడానికి అమెరికా వెళ్ళిన రామ్ చరణ్ తిరిగి వచ్చినా ‘థని ఒరువన్’ ఎప్పుడు మొదలు పెడతాడో మెగా కాంపౌండ్‌కే తెలియని పరిస్థితులు ఏర్పడ్డాయని అంటున్నారు. దీనికితోడు గౌతమ్ మీనన్ చరణ్‌తో సినిమా చేస్తాడు అనే వార్తలు ఆమధ్య వచ్చినా ఆ వార్తలు కూడా ఇప్పుడు ఆగిపోయయాయి. ఈ పరిస్థితులు ఇలా ఏర్పడటానికి చరణ్ చాలామంది దర్శకులకు అందుబాటులో ఉండడం లేదు అన్న గుసగుసలు వినిపిస్తున్నాయి. దీనికితోడు మెగా కాంపౌండ్‌కు అత్యంత నమ్మకంగా ఉండే వినాయక్ కూడా జూనియర్‌తో తనతదుపరి సినిమా ఆలోచనలలో ఉన్నట్లుగా ఇప్పటికే వార్తలు వస్తున్నాయి. ఇలా మెగా కంపౌండుకు సన్నిహితంగా ఉండే నిర్మాతలు దర్శకులు మెగా కాంపౌండుకు దూరం అవడం ప్రారంభిస్తే రామ్‌చరణ్ పరిస్థితి ఏమిటి అన్న కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఏమైనా ప్రస్తుతం కలవరపాటులో మెగా కాంపౌండ్ ఉంది అనుకోవాలి.

Tag :Mega compound in the future worries


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *