ఎప్రిల్ 8న మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ ‘గని’ సినిమా విడుదల..

సినిమాముచ్చట్లు:
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా కిరణ్ కొర్రపాటి తెరకెక్కించిన సినిమా గని. అల్లు బాబీ కంపెనీ, Renaissance పిక్చర్స్ బ్యానర్స్‌పై సిద్ధూ ముద్ద, అల్లు బాబీ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమాకు మెగా నిర్మాత అల్లు అరవింద్ సమర్పకుడిగా ఉన్నారు. ఈ సినిమాలోని పాటలకు మంచి రెస్పాన్స్ వస్తుంది. ఈ మధ్యే విడుదలైన రోమియో జూలియట్ పాటకు సైతం మంచి స్పందన వస్తుంది. లెజెండరీ దర్శకుడు శంకర్ కూతురు అతిథి శంకర్ ఈ పాట పాడారు.  ఇప్పటికే విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది. ముఖ్యంగా వరుణ్ తేజ్ మేకోవర్ అందరికీ బాగా నచ్చేస్తుంది. ఈ సినిమా ఎప్రిల్ 8న విడుదల కానుంది. ఇప్పటికే సెన్సార్ పూర్తి చేసుకున్న ఈ సినిమాకు ఒక్క కట్ కూడా లేకుండా U/A సర్టిఫికెట్ ఇచ్చింది సెన్సార్ బోర్డు. సాయి మంజ్రేకర్ హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రంలో జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర కీలక పాత్రల్లో నటించారు. సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేయనున్నారు దర్శక నిర్మాతలు.
నటీనటులు: వరుణ్ తేజ్, సాయి మంజ్రేకర్, జగపతిబాబు, సునీల్ శెట్టి, ఉపేంద్ర, నవీన్ చంద్ర తదితరులు.
 
Tags:Mega Prince Varun Tej ‘Gani’ movie release on April 8 ..

Natyam ad