అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభించిన మేకపాటి దీప్తి

ఆత్మకూరు ముచ్చట్లు:
నెల్లూరు జిల్లా ,ఆత్మకూరు పట్టణంలోని అరుంధతి వాడలో గురువారం మేకపాటి గౌతమ్ రెడ్డి ఉత్తరక్రియలు సందర్భంగా ఆత్మకూరులో తోడేటి మణి నేతృత్వంలో సుమారు 4 వందల మందికి అన్నదాన కార్యక్రమం చేపట్టారు .ఈ సందర్భంగా వైకాపా ఎస్సీ సెల్ పట్టణ అధ్యక్షుడు తోడేటి మణి మాట్లాడుతూ దివంగత నేత మేకపాటి గౌతమ్ రెడ్డి సేవలను మరువలేమని ఆయన సొంత నిధులు వెచ్చించి సంఘం దగ్గర మరణించిన వారిలో మిగిలి అనాధగా మిగిలిన బాలుడికి 10 లక్షలు వెచ్చించటం ,చేతి వృత్తులు చేసుకుని జీవిస్తున్న పేదల పట్ల సానుకూలంగా స్పందించి రూములు ఇప్పించిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు.  రాజకీయాలకు అతీతంగా పనిచేస్తూ పేదల పక్షపాతిగా నిలిచారని ఆయన  ఆకస్మిక మరణం పొందటం మా లాంటి పేదలకు తీరనిలోటని తెలిపారు.ఆయన ఉత్తరక్రియలు ఉదయగిరిలో గురువారం జరుగుతున్న నేపథ్యంలో ఆత్మకూరులో అరుంధతి వాడలో అన్నదాన కార్యక్రమం డాక్టర్ మేకపాటి దీప్తి చేతులమీదుగా ప్రారంభించడం జరిగిందని తెలిపారు.ఈ కార్యక్రమంలో స్థానిక వైకాపా నాయకులు విహారి,దిలీప్ ,పవన్, హరి రాంకీ, తదితరులు పాల్గొన్నారు.
 
Tags: Mekapati Deepti who started the Annadana program

Natyam ad