అభివృద్ధి పనులను పరిశీలించిన కేంద్రకమిటి సభ్యులు

పులిచెర్ల ముచ్చట్లు:
 
మండలంలోని మంగళంపేట పంచాయతీలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా అమలౌతున్న పలు అభివృద్ధి పనులను రెండవ రోజు మంగళవారం కేంద్ర కమిటి సభ్యులు క్షేత్ర స్థాయిలో పనులను పరిశీలించారు. జాతీయ స్థాయిలో ఉత్తమ పంచాయతీలో ఎంపిక కోసం ప్రతిపాదనలు పంపడంతో ఈ పంచాయతీలో జరుగుతున్న అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. పంచాయతీలోని చెపల చెరువులు, ఫారంపండ్లు, పాఠశాలలో నాడు-నేడు పనులు , సచివాలయాలలో రికార్డులను పరిశీలించారు. అనంతరం స్వయం సహాయక సభ్యులు , ఉప్యాధిహామి కూలీలతో చర్చించారు. పనులను పరిశీలించిన అనంతర ం సంతృప్తి వ్యక్తం చేశారు. మహిళా దినోత్సవం సందర్భంగా అక్కడికి విచ్చేసిన మహిళలను సన్మానించారు. పనులను పరిశీలించి, కేంద్రానికి నివేదికలు సమర్పిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో కేంద్రకమిటి సభ్యులు అరుణ్‌కుమార్‌మిశ్రా, ఆశిస్‌యాదవ్‌, జెడ్పిసీఈవో ప్రభాకర్‌రెడ్డి, డీపీవో దశరథరామిరె డ్డి, డిఎల్‌పీవో రుపేంద్రనాథరెడ్డి, ఎంపీపీ సురేంద్రనాథరెడ్డి, ఎంపీడీవో సుగుణమ్మ, మార్కెట్‌ కమిటి ఉపాధ్యక్షుడులు నాగరాజప్రసాద్‌, సర్పంచ్‌లు మధు, వాసుదేవరెడ్డి పాల్గొన్నారు.
 
Tags: Members of the Central Committee who examined the development work
 

Natyam ad