పాఠశాలల అభివృద్ధికి ఎస్ఎంసి కమిటీ సభ్యులు సహకరించాలి 

పెద్దపంజాణి ముచ్చట్లు

ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ సభ్యులు సహకరించాలని మండల విద్యాధికారి హేమలత కోరారు. స్థానిక ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎంఈఓ అధ్యక్షతన జరిగిన బడి మనదే – బాధ్యతనదే కార్యక్రమాన్ని ఎంపిపి మురళీ కృష్ణ ప్రారంబించారు. ఎస్ఎంసీ కమిటీ సభ్యులకు ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం లో ఎంఈఓ మాట్లాడుతూ పాఠశాలల పురోభివృద్ధికి ఎస్ఎంసి సభ్యులు పూర్తి స్థాయిలో సహకరించాలని, భాగస్వాములు కావాలని సూచించారు. మండల పరిధిలో మొత్తం 1540 మంది సభ్యులున్నారని ఆమె తెలిపారు. మొదటి రోజు శిక్షణా కార్యక్రమానికి 70 శాతం ఎస్ఎంసిలు హాజరు అయ్యారని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ రెడ్డి, విషయ నిపులు శివశంకర్,సాంబిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Tag : Members of the SMC Committee should cooperate with the development of schools


Leave a Reply

Your email address will not be published. Required fields are marked *