రేవంత్ లో మెంబర్ షిప్ జోష్

హైదరాబాద్ ముచ్చట్లు:
 
ముందస్తు ఎన్నికల ముహూర్తం దగ్గర పడుతోందనే వార్తలు, ఊహాగానాలు వినవస్తున్న నేపధ్యంలో తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ (టీపీసీసీ) చీఫ్’ రేవంత్ రెడ్డి పార్టీ మీద పట్టును పెంచుకునేందుకు వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నారా? అందుకు డిజిటల్ సభ్యత్వ కార్యక్రమాన్నిఅస్త్రంగా ఉపయోగించు కుంటున్నారా?  అంటే, అవుననే అంటున్నాయి, గాంధీ భవన్ వర్గాలు.నిజానికి, కాంగ్రెస్ పార్టీలో, సభ్యత్వ నమోదు కార్యక్రమానికి ప్రాధాన్యత ఇచ్చే సంస్కృతీ గతంలో ఎప్పుడూ పెద్దగా లేదు. అదొక మొక్కుబడి తంతుగానే ముగిసి పోతుంటుంది. కానీ రేవంత్ రెడ్డి,డిజిటల్ సభ్యత్వ పద్దతిని ఎంచుకోవడమే కాకుండా, 30 లక్షల క్రియాశీల సభ్యులను చేరుస్తామని పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ఇచ్చారు. అయితే, ఇప్పటికే కాంగ్రెస్ క్రియాశీల సభ్యత్వం 40 లక్షలు దాటిందని రేవంత్ రెడ్డి ప్రకటించారు. గడవు ముగిసే లోగా 50 లక్షలకు చేరుతుందని ధీమా వ్యక్త పరుస్తున్నారు. నిజానికి సభ్యత్వ నమోదును కార్యకర్తలు, నాయకుల సామర్ధ్యానికి లిట్మస్ టెస్ట్’ గా చేసిన రేవంత్ రెడ్డి పరీక్షలో పాస్ అయితనే పదవులు అని పార్టీలో కొత్త సంస్కృతికి నారు పోశారు.కొత్త  నాయకత్వాన్ని ప్రోత్సహిస్తున్నారు. సభ్యత్వ నమోదు కార్యక్రమంలో క్రియాశీల పాత్రను పోషించిన కార్యకర్తలను ముందెన్నడూ లేని విధంగా సన్మానిస్తున్నారు. నిజమైన కధానాయకులు మీరే, నిజమైన హీరోలు మీరే, కాంగ్రెస్ పార్టీ సినిమాలో మీరే, హీరులు అని ఉత్సాహపరుస్తున్నారు. అదే సమయంలో పని చేయని వారికి పార్టీలో పదవులు ఉండవని, పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో శ్రద్ద పెట్టని వారు ఎంతటి వారైనా పార్టీ టికెట్, పదవులు దక్కవని స్పష్టంగా చెపుతున్నారు. అంతే కాదు, ఇంతవరకు నాయకుల పార్టీగా గుర్తింపు పొందిన కాంగ్రెస్ పార్టీ ఇకపై కార్యకర్తల పార్టీగా ఉంటుందని క్యాడర్’ లో  కొత్త ఉత్సహాన్ని నింపుతున్నారు. ఒక విధంగా రేవంత్ రెడ్డి పార్టీలో తనకంటూ ఒక వర్గాన్నిఏర్పాటు చేసుకుంటున్నారు.
 
 
అదే సమయంలో రేవంత్ రెడ్డి పట్ల గుర్రుగా ఉన్న సేనియర్ల విషయంలోనూ, రేవంత్ రెడ్డి ఇంతవరకు అనుసరిస్తూ వచ్చిన మెతక  వైఖరి, బుజ్జగింపు ధోరణికి  చుక్క పెట్టాలనే నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అందుకే రేవంత్ రెడ్డి,  సభ్యత్వంలో బలంగా పని చేసిన వారికే టికెట్ అవకాశాలు ఉంటాయని మరోసారి స్పష్టం చేశారు.. ఎలాంటి పైరవీ లేకుండా వాళ్లకు టికెట్ ఇచ్చే హామీ తన్నదే ని స్పష్టం చేశారు. పని చేయని వారికి టికెట్‌తో పాటు ఎలాంటి పదవి రాకుండా నేను అడ్డుకుంటానని వార్నింగ్ ఇచ్చారు. ప్రతి బూత్ నుంచి వంద సభ్యత్వం ఉంటేనే ఆ నియోజవర్గంలో పీసీసీ మెంబర్ ఉంటుంది. వంద సభ్యత్వం లేకుండా ఎంత పెద్ద నాయకుడు ఉన్నా పీసీసీ సభ్యత్వం ఇవ్వమని చెప్పారు.. టికెట్ల ఎంపికలో ఢిల్లీ నుంచి అభిప్రాయ సేకరణ చేస్తారని, కాబట్టి టికెట్ ఆశించిన వారు జాగ్రత్తగా పనిచేయాలని అన్నారు. సభ్యత్వంపై పని చేసిన వారిపై సమగ్ర నివేదిక సోనియా గాంధీకి అందజేస్తానని చెప్పారు.. రాబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో పార్టీ సభ్యత్వం ఉన్నవారికే మొదటి ప్రాధాన్యత ఉంటుందని అన్నారు.. పార్టీ సమావేశానికి రాని వారిని, లైట్‌గా తీసుకున్న వారిని పదవుల ఎంపికలో అవకాశాలు కల్పించమని స్పష్టం చేశారు.అయితే, కాంగ్రెస్ పార్టీలో ప్రజాస్వామ్యం కొంచెం చాలా ఎక్కువ, ఎప్పుడు ఏమి జరుగుతుందో, ఎవరూ చెప్పలేరని, అంటున్నారు.
 
Tags: Membership in Rewanth Josh

Natyam ad