పండుగ రోజుల్లో మెట్రో రాయితీలు

Date:12/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
 ప్రయాణికులను మరింత ఆకర్షించేందుకు రాయితీలు ప్రకటించాలని హైదరాబాద్ మెట్రో రైలు యోచిస్తున్నది. దీనికి సంబంధించిన ప్రతిపాదనలను ఎల్ అండ్ టీ సంస్థ ముందుంచింది. దసరా, దీపావళి, రాఖీపౌర్ణమి, బోనాలు, జనవరి 26, ఆగస్టు 15, తెలంగాణ ఆవిర్భావదినోత్సవం, మెట్రో ప్రారంభదినోత్సవం, గాంధీ జయంతి ఇలా ప్రత్యేక రోజుల్లో రాయితీలు ఇవ్వాలని ప్రతిపాదించినట్లు తెలిసింది. దీనిపై సాధ్యాసాధ్యాలను ఎల్ అండ్ టీ సంస్థ పరిశీలిస్తున్నట్లు తెలిసింది. ఇప్పటికే స్మార్ట్‌కార్డులపై 10 శాతం రాయితీ అందిస్తున్న ఎల్‌అండ్‌టీ అదే విధానంలో మరిన్ని రాయితీలు అందిస్తే ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరుగుతుందని ఆలోచిస్తున్నారు.అయితే ఈ అంశంపై ఇప్పటికీ ఎల్‌అండ్‌టీ స్పష్టత ఇవ్వలేదని సమాచారం. రాయితీలు ఇవ్వడం వల్ల నష్టమేమిలేదని వివరించినట్లు తెలిసింది. ఇప్పుడు తిరుగుతున్న రైళ్లకు అదనంగా నడిపించాల్సిన అవసరం లేదని, విద్యుత్ ఖర్చు, నిర్వహణ కూడా ఎక్కువ కాదని వివరించినట్లు తెలిసింది. ప్రతిపాదనలపై ఎల్‌అండ్ టీ సానుకూలంగా స్పందిస్తే ప్రయాణికుల సంఖ్య పెరుగుతుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. గతంలో ప్రైవేటు ఆపరేటర్ల నుంచి పోటీ ఎదుర్కునే సమయంలో ఆర్టీసీ అనేక పథకాలు ప్రకటించింది. టికెట్ లాటరీనీ కూడా నిర్వహించి ఆపరేషన్ రేషియోను పెంచుకొనేందుకు ప్లాన్ చేస్తోంది.
Tags: Metro concessions in festive days

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *