పాత బస్తీలో మెట్రో పరుగులు

Date:16/03/2018
హైద్రాబాద్ ముచ్చట్లు:
పాత రూట్‌లోనే పాతబస్తీలో మెట్రోరైలు పరుగులు తీయనుంది. కారిడార్-2లో భాగంగా సికిందరాబాద్ జేబీఎస్ నుంచి పాతబస్తీ ఫలక్‌నుమా వరకు ప్రతిపాదించిన మెట్రోరైలు కారిడార్ ఆలైన్‌మెంట్ మారుతుందా? అనే అనుమానాలకు సీఏం కేసీఆర్  తెర దింపారు. ముందు ప్రతిపాదించిన రూట్‌లోనే పాతబస్తీ మెట్రోరైలు ప్రాజెక్టును నిర్మించనున్నట్లు స్పష్టం చేశారు. మజ్లీస్ శాసనసభ పక్ష నేత అక్బరుద్దీన్ అడిగి ప్రశ్నకు సీఎం సమాధానం చెప్పారు. ముందుగా ప్రతిపాదించిన విధంగా గౌలీగూడ సీబీఎస్ నుంచి పాతబస్తీలోని పలు చారిత్రక కట్టడాల పక్క నుంచి అలైన్‌మెంట్ రూపొందించటంతో, వాటిని తొలగించటం వివాదాస్పదంగా మారే అవకాశముండటంతో ప్రభుత్వం ఈ కారిడార్ నిర్మాణాన్ని జేబీఎస్ నుంచి సీబీఎస్ వరకే పరిమితం చేసి పనులను వేగవంతం చేసింది. మజ్లీస్ పార్టీకి చెందిన నేతల ఆస్తులను పరిరక్షించేందుకే ప్రభుత్వం దీని ఆలైన్‌మెంట్‌లో మార్పు చేసిందంటూ బీజేపీ పార్టీలు నేతలు ఆరోపణలు కూడా చేశారు. అలైన్‌మెంట్‌లో మార్పులు చోటుచేసుకుంటాయా? అనే అనుమాలు నెలకొన్నా, జేబీఎస్ నుంచి సీబీఎస్ వరకు పనులు దాదాపు యాభై శాతం కంటే ఎక్కువ పూర్తయ్యాయి. ఇపుడు సీబీఎస్ నుంచి పాతబస్తీలోని సీబీఎస్ నుంచి సాలార్‌జంగ్ మ్యూజియం, చార్మినార్, శాలిబండ, శంషీర్‌గంజ్, ఫలక్‌నుమా వరకు సుమారు 15కిలోమీటర్ల పొడువున, 15 స్టేషన్లతో ఈ కారిడార్‌ను నిర్మించనున్నారు.
Tags: Metro runs in old basti

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *