Mimicry bheeshmu nerela veenamadav pass away

మిమిక్రీ భీష్ముడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూత

Date:19/06/2018
వరంగల్ ముచ్చట్లు:
తెలంగాణ మరో కళాకారుడిని కోల్పోయింది. మిమిక్రీ లోకం మూగబోయింది. ప్రముఖ మిమిక్రీ కళాకారుడు నేరెళ్ల వేణుమాధవ్ కన్నుమూశారు. గతకొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇవాళ తుదిశ్వాస విడిచినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వేణుమాధవ్ ఇక లేరన్న వార్త తెలుసుకున్న ఆయన సన్నిహితులు, అభిమానులు, మిమిక్రీ కళాకారులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. వేణుమాధవ్ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపిన ప్రముఖులు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.  వేణుమాధవ్ పేరిట తపాళా శాఖ పోస్టల్ స్టాంప్ను విడుదల చేసింది. మూడు యూనివర్సిటీల గౌరవ డాక్టరేట్ పొందిన వేణుమాధవ్.. ఆంధ్ర యూనివర్సిటీ నుంచి కళాప్రపూర్ణ పురస్కారం అందుకున్నారు. ధ్వని అనుకరణలో ఆయనకు ఆయనే సాటిగా గుర్తింపు పొందారు. తెలంగాణలో ఎందరో శిష్యులను తయారు చేశారు.డిసెంబర్ 28, 1932న వరంగల్ జిల్లాలోని మట్టెవాడలో శ్రీహరి, శ్రీలక్ష్మీ దంపతులకు వేణుమాధవ్ జన్మించారు. 1947లో పదహారేళ్ల వయసులోనే మిమిక్రీ కళారంగంలో వేణుమాధవ్ ప్రవేశించారు. ఆ తర్వాత దేశవిదేశాల్లో అనేక ప్రదర్శనలు ఇచ్చారు. తెలుగు, హిందీ, ఇంగ్లీష్, ఉర్దూ, తమిళంలో అనేక ప్రదర్శనలు ఇచ్చి అందరి మన్ననలు పొందారు. 2001లో నేరెళ్ల వేణుమాధవ్ పద్మశ్రీ పురస్కారం అందుకున్నారు. ఆయన జన్మదినాన్ని ప్రపంచ మిమిక్రీ కళాకారుల దినోత్సవంగా జరుపుకుంటున్న సంగతి తెలిసిందే. 1971లో పీవీ నరసింహరావు ఏపీ సీఎంగా ఉన్న సమయంలో  వేణుమాధవ్ ఎమ్మెల్సీగానూ కొనసాగారు.
Tags:Mimicry bheeshmu nerela veenamadav pass away

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *