Minister Amar is a welcome welcome in the Trivandrum program

ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో మంత్రి అమర్ కు అపూర్వ స్వాగతం – అడుగడుగునా జన నీరాజనం

Minister Amar
Minister Amar
Date : 10/12/2017
పలమనేరు ముచ్చట్లు:
రాష్ట్ర పరిశ్రమల శాఖా మంత్రి అమరనాథ్ రెడ్డి చేపట్టిన ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమంలో ప్రజలనుంచి అపూర్వ స్వాగతం లభించింది. మంగళ హారతులు పట్టి మహిళలు నీరాజనాలు పలికారు. పలమనేరు రూరల్ మండలంలోని సంబార్ పూర్ గ్రామంలో మంత్రి అమరనాథ్ రెడ్డి పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన సుమారు రూ. 7 లక్షలతో గ్రామంలో నూతనంగా నిర్మించబోయే అంగన్‌వాడీ భవనానికి శంకుస్థాపన చేశారు. అదేవిధంగా రూ. 3.65 లక్షల తో సీసీ రోడ్డు నిర్మాణానికి భూమి పూజ చేసి ప్రారంభించారు. పలు గ్రామాలలో తెదేపా జెండాలు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్రం లోటు బడ్జెట్‌లో ఉన్నప్పటికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆద్వర్యంలో తెలుగుదేశం ప్రభుత్వం ప్రజల సంక్షేమం కోసం ఎన్నో అభివృద్ధి పథకాలను ప్రవేశపెడుతోందన్నారు. గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు తమ ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చిందని తెలిపారు. గ్రామీణ రోడ్లు, సీసీ రోడ్లు, మరుగుదొడ్ల నిర్మాణం, గృహాల నిర్మాణం, నిరుద్యోగ బృతి వంటి పథకాలను అర్హులందరికీ వందశాతం అమలయ్యే విదంగా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. బోయ, కాపు, మైనారిటీ వర్గాల అభివృద్ధికి అత్యంత ప్రాధాన్యతను ఇచ్చింది ఒక్క తెలుగుదేశం ప్రభుత్వం మాత్రమేనని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు పార్టీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags : Minister Amar is a welcome welcome in the Trivandrum program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *