AMAR

గంగవరంలో ‘ఇంటింటికీ తెలుగుదేశం’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్న మంత్రి అమరనాథ్ రెడ్డి 

Date : 13/12/2017
గంగవరం ముచ్చట్లు:
పలమనేరు నియోజకవర్గంలోని గంగవరం మండలంలో రాష్ట్ర పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి ఇంటింటికీ తెలుగుదేశం కార్యక్రమాన్ని నిర్వహించారు. స్థానిక తెదేపా నాయకులు మంత్రికి పూలమాలలు వేసి స్వాగతం పలికారు.దండపల్లె, కురప్పల్లె గ్రామాలలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రభుత్వ సంక్షేమ పథకాలను తెలిపే కరపత్రాలను అందజేశారు. అలాగే పాల సేకరణ కేంద్రాన్ని పరిశీలించారు. గ్రామీణాభివృద్ధే  తెదేపా ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని ఆయన ప్రజలకు తెలిపారు. ఈ కార్యక్రమంలో మండల తెదేపా నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
Tags : Minister Amarnath Reddy, who runs the Telugu Desam program

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *