మంత్రి గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పట్ల దిగ్భ్రాంతి -మంత్రి  పెద్దిరెడ్డి

తిరుపతి ముచ్చట్లు:
 
మంత్రి  మేకపాటి గౌతమ్ రెడ్డి హఠాత్మరణం పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.చిన్న వయస్సులోనే  గౌతమ్ రెడ్డి చాలా గొప్ప పేరు తెచ్చుకున్నారని పేర్కొన్న మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.మంత్రి  పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కామెంట్స్.మేకపాటి గౌతమ్ రెడ్డి మరణ వార్త బాధించింది.చిన్న వయస్సులోనే ఆయన మనల్ని వదిలి వెళ్ళడం బాధాకరం.మంత్రిగా చాలా చురుగ్గా పని చేసి మంచి పేరు తెచ్చుకున్నారు.నిన్నటి వరకు రాష్ట్రానికి పెట్టుబడులు తెచ్చేందుకు కృషి చేశారు.ఆయన అధ్వర్యంలో ఆంధ్ర ప్రదేశ్ పెట్టుబడి రంగం అభివృద్ధి సాధించింది.మేకపాటి కుటుంబానికి నా ప్రగాఢ సానుభూతి.గౌతమ్ రెడ్డి మరణం పార్టీకి, ప్రజలకు తీరని లోటు.
 
Tags:Minister Gautam Reddy shocked by sudden death – Minister Peddireddy

Natyam ad