బీజేపీని బొంద పెట్టడమే కేసీర్‌ లక్ష్యం: జగదీష్‌రెడ్డి

సూర్యాపేట ఫిబ్రవరి 22: బీజేపీ మిషన్ తెలంగాణ నినాదంపై మంత్రి జగదీష్‌రెడ్డి ఫైర్‌ అయ్యారు. బీజేపీ మిషన్ తెలంగాణ కాదు, సీఎం కేసీఆర్ మిషన్ ఢిల్లీ మొదలు పెట్టారన్నారు. ప్రజావ్యతిరే పాలన చేస్తున్న బీజేపీని బొంద పెట్టడమే లక్ష్యంగా సీఎం కేసీర్‌ పని చేస్తున్నారని మంత్రి జగదీష్‌రెడ్డి అన్నారు. సూర్యాపేటలో మంత్రి మీడియాతో మాట్లాడుతూ..తెలంగాణలో దేశం గర్వించదగ్గ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. అలాంటి పథకాలు దేశ వ్యాప్తంగా అమలు చేయాలని డిమాండ్లు వస్తున్నాయని తెలిపారు. సీఎం కేసీఆర్‌పై ఎల్లలుదాటి వస్తున్న అభిమానాన్ని చూసి ఓర్వలేకే బీజేపీ కుట్రలు పన్నుతుందని ఆరోపించారు.

కేసీఆర్‌ని తెలంగాణకు పరిమితం చేయాలని బీజేపీ చూస్తుంది.ల్లీలో బీజేపీని గద్దె దింపడానికి మా కార్యక్రమం మొదలైందన్నారు. ఏ ముఖం పెట్టుకుని బీజేపీ ప్రజల్లోకి వస్తుందని ప్రశ్నించారు. దేశంలో ఏం అభివృద్ధి జరిగిందో బీజేపీ చెప్పాలన్నారు.దళారీలను బాగు చేయడమేనా అభివృద్ధి అంటే అని సూటిగా ప్రశ్నించారు. బీజేపీ మిషన్‌లన్నీ బంగాళాఖాతంలో కలవాల్సిందేనని స్పష్టం చేశారు. తెలంగాణ అభివృద్ధి నమూనా దేశానికి అవసరమని, దేశ ప్రజలు గుర్తిస్తున్నారు. ఇక బీజేపీ ఆటలు సాగవన్నారు.

Post Midle
Natyam ad