Minister Ketiar review on industries and IT department

పరిశ్రమలు, ఐటీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష

Date : 06/12/2017
హైదరాబాద్ ముచ్చట్లు:
పరిశ్రమలు, ఐటీ శాఖపై మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. ఫార్మా భూసేకరణను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారాయన. వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ఇంటింటికి ఇంటర్నెట్ అందజేయాలని సూచించారు. కేంద్రం భారత్ నెట్ కింద అందిస్తున్న నిధులతో కలిపి వచ్చేఏడాది డిసెంబర్ నాటికి ఫైబర్ గ్రిడ్ను పూర్తి చేయాలని చెప్పారు. విద్యా, వైద్య రంగాల్లో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని మంత్రి అన్నారు. ఈ సందర్భంగా తెలంగాణ ఫైబర్ గ్రిడ్ కార్పొరేషన్కు మంజూరైన రూ.560 కోట్ల రుణం పత్రాలను విజయబ్యాంక్ డిప్యూటీ జీఎం సత్యానారాయణరాజు మంత్రి కేటీఆర్కు అందజేశారు.
Tags : Minister Ketiar review on industries and IT department

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *