Natyam ad

రాజన్న సేవలో మంత్రి కొప్పుల.

-పెగడపల్లి ఆలయాలలో ప్రత్యేక పూజలు నిర్వహించిన మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు.
-మంత్రి కొప్పులకు పూర్ణకుంభంతో ఘన స్వాగతం పలికిన ఆలయ కమిటీ, పూజారులు.
-భక్తులతో కిటకిటలాడిన శైవక్షేత్రాలు.
ధర్మపురిముచ్చట్లు:
జగిత్యాల జిల్లా పెగడపెల్లి మండల కేంద్రంతో పాటు, వెంగలాయిపేట, నంచర్ల, ధీకొండ గ్రామాల్లో తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్, వారి సతీమణి స్నేహలత మంగళవారం పర్యటించారు.మహా శివరాత్రి పండుగను పురస్కరించుకొని మంత్రి కొప్పుల ఈశ్వర్ దంపతులు పెగడపల్లి మండలంలోని పలు శివాలయాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, కోడె మొక్కులు తీర్చుకున్నారు,మంత్రి కొప్పుల దంపతులను ఆలయ కమిటీ, పూజారులు పూర్ణకుంభంతో స్వాగతించి, ఘనంగా సన్మానించి, తీర్థప్రసాదాలు అందజేశారు.ఈ సందర్భంగా తెలంగాణ రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి కొప్పులఈశ్వర్ మాట్లాడుతూ పెగడపల్లి మండలం మండల కేంద్రంలోని స్వయంభు శ్రీ రాజరాజేశ్వర స్వామి దేవాలయ గాలి గోపురానికి 50 లక్షల రూపాయలను, నంచర్ల గ్రామంలోని  రామాలయ రాజ గోపురానికి50 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు మంత్రి కొప్పుల ఈశ్వర్ తెలిపారు. రాష్ట్రంలోని దేవాలయాలను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధి చేస్తుందని ఈ సందర్భంగా మంత్రి పేర్కొన్నారు. ఈకార్యక్రమంలో మంత్రి వెంట పెగడపల్లి శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయ కమిటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు భూమాడి గంగారెడ్డి, చాట్ల ప్రశాంత్ మరియు ఆలయ కమిటీ సభ్యులు,  జెడ్పిటిసి కాసుగంటిరాజేంద్ర రావు ఎంపీపీ గోలి శోభ – సురేందర్ రెడ్డి, ఏఎంసీ చైర్మన్ తిరుపతి నాయక్, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు వివిధ గ్రామాల ఆలయ కమిటీ సభ్యులు, టిఆర్ఎస్ పార్టీ నాయకులు,తదితరులు పాల్గొన్నారు.
 
Tags:Minister Koppula in the service of the King.