పుంగనూరులో ఆర్టీసి బస్సును ప్రారంభించిన మంత్రి పెద్దిరెడ్డి
పుంగనూరు ముచ్చట్లు:
అంతర్ జిల్లాల ఆర్టీసి బస్సును మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆదివారం ప్రారంభించారు. పట్టణంలో ఆర్టీసి సీనియర్ ట్రాఫిక్ మేనేజర్ జితేంద్రనాథరెడ్డి చిత్తూరు జిల్లా నుంచి అన్నమయ్య జిల్లా రాయచోటికి ఏర్పాటు చేసిన బస్సును మంత్రి ప్రారంభించారు. ఈ ఆర్టీసి బస్సు ప్రతిరోజు సోమల మీదుగా రాయచోటికి వెళ్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆర్టీసి డీఎం సుధాకరయ్య, నాయకులు జయరామిరెడ్డి, కరీముల్లా, రెడ్డి, కుమార్, బాషా తదితరులు పాల్గొన్నారు.

Tags: Minister Peddireddy launches RTC bus in Punganur
