పుంగనూరులో అమ్మవారి పూజల్లో పాల్గొన్న మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:
 
మండలంలోని కురప్పల్లెలో రెండు రోజుల పాటు జరిగిన మసెమ్మ జాతర ముగింపు పూజల్లో మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆయన తొలుత మసెమ్మ జాతరలో పాల్గొన్నారు. అలాగే పట్టణంలోని మేల్‌ మరవత్తూరు అమ్మవారి ఆలయంలో పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రజలను కరోనాభారీ నుంచి కాపాడాలని , వర్షాలు కురిసి , పంటలు పండి ప్రతి ఒక్కరు సుబిక్షంతో వర్ధిల్లాలని ప్రార్థించినట్లు తెలిపారు. ఈయన వెంట ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి, ముడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌, ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డి, వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి తదితరులు పాల్గొన్నారు.

Tags; Minister Peddireddy participating in the worship of Goddess in Punganur

Natyam ad