Natyam ad

73వ గణతంత్రం దినోత్సవంలో మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి

విజయవాడ ముచ్చట్లు:

విజయవాడ బందర్ రోడ్ లోని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి, భూగర్భగనులు, గ్రామ సచివాలయాల శాఖా మంత్రి క్యాంప్ కార్యాలయంలో 73వ గణతంత్రం దినోత్సవం ఘనంగా నిర్వహించారు. క్యాంప్ కార్యాలయంలో   రాష్ట్ర మంత్రి . డాక్టర్.పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి  ముందుగా జాతిపిత మహాత్మా గాంధీ, రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటాలకు పూలమాలలు వేసి నివాళి అర్పించారు. అనంతరం జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గణతంత్రం దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పలువురు గ్రామ సచివాలయ ఉద్యోగులు, పాఠశాల విద్యార్ధినులు, క్యాంప్ కార్యాలయ ఉద్యోగులు, సిబ్బంది పాల్గొన్నారు.
పుంగనూరులో రిపబ్లిక్‌డే నాడు బిరియాని విక్రయాలు
Tags: Minister Peddireddy Ramachandrareddy on the occasion of the 73rd Republic Day