పుంగనూరులో 11న గడపగడపకు ప్రారంభించనున్న మంత్రి పెద్దిరెడ్డి

పుంగనూరు ముచ్చట్లు:

వైఎస్సార్‌సీపీ గడపగడపకు కార్యక్రమాన్ని రాష్ట్ర మంత్రి డాక్టర్‌ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి బుధవారం ఉదయం బోడేవారిపల్లెలో ప్రారంభిస్తారని ఎంపీపీ అక్కిసాని భాస్కర్‌రెడ్డి తెలిపారు. మంగళవారం మండల కార్యాలయంలో మంత్రి పిఏ చంద్రహాస్‌, పికెఎం ఉడా చైర్మన్‌ వెంకటరెడ్డి యాదవ్‌,ఏఎంసీ చైర్మన్‌ నాగరాజారెడ్డితో కలసి అన్ని శాఖల అధికారులు సమావేశం నిర్వహించారు. భాస్కర్‌రెడ్డి మాట్లాడుతూ నాలుగు రోజుల పాటు జరిగే కార్యక్రమాలకు అన్ని శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరై, ప్రభుత్వ పథకాలను ఇంటింటికి వెళ్లి వివరిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో ప్రతి ఒక్కరు పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ సమావేశంలో ఎంపీడీవో లక్ష్మీపతి, ఏఎంసీ మాజి చైర్మన్‌ అమరనాథరెడ్డి, మాజీ ఎంపీపీ నరసింహులు, పార్టీ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, చంద్రారెడ్డి యాదవ్‌ తదితరులు పాల్గొన్నారు.

 

Post Midle

Tags; Minister Peddireddy will inaugurate Gadapagadap on the 11th in Punganur

Post Midle
Natyam ad