Miner reacted to Revenue Reddy's allegationsist

రేవంత్‌ రెడ్డి ఆరోపణలపై స్పందించిన మంత్రి

సాక్షి

Date :07/01/2018

హైదరాబాద్‌ : కొడంగల్‌ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి ఆరోపణలపై ఆరోగ్య శాఖా మంత్రి లక్ష్మారెడ్డి స్పందించారు. విలేకరులతో మాట్లాడుతూ..ఇప్పటికే తన కాలేజీ, సర్టిఫికెట్ గురించి స్పష్టత ఇచ్చానని చెప్పారు. అయినప్పటికీ కావాలని రేవంత్‌ రెడ్డి తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి ఈ విషయాన్ని ఇంతటితో వదిలేస్తే మంచిదన్నారు. ఆరోపణలు చేసే వారే పది మంది జర్నలిస్టులను సెలెక్ట్ చేస్తే గుల్బర్గా యూనివర్సిటీకి తీసుకు వెళ్లేందుకు సిద్ధమని వ్యాఖ్యానించారు. వాళ్లే నిజనిర్ధారణ చేయాలని, అవి తప్పు అని తేలితే తాను రాజకీయ సన్యాసం తీసుకుంటానని సవాల్‌ విసిరారు. ఎన్నికల అఫిడవిట్లో కూడా నిజాలే పేర్కొన్నా..తప్పులు ఉంటే ఎన్నికల సంఘం చుసుకుంటుందని చెప్పారు. సంపత్ రావు అనే వ్యక్తి తన క్లాస్‌మేట్‌ కాదని, తాను చదివేటప్పుడు తమ లెక్చరర్‌ అని పేర్కొన్నారు. జర్నలిస్ట్ కమిటీని ఎప్పుడు పంపినా తాను సిద్దంగా ఉంటానన్నారు. లేదంటే ఆరోపణలు చేసే వారు కానీ, మీడియా కానీ మరోసారి ఈ అంశాన్ని ప్రస్తావించొద్దని చెప్పారు. మంత్రి లక్ష్మారెడ్డి నకిలీ డాక్టర్‌ అని, ఎంబీబీఎస్‌ పూర్తి చేయకుండానే డాక్టర్‌ అని చెప్పుకుంటున్నాడని రేవంత్‌ రెడ్డి పలుమార్లు ఆరోపణలు గుప్పించిన సంగతి తెల్సిందే.

Tags : Miner reacted to Revenue Reddy’s allegationsist

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *