ఏడుపాయల వనదుర్గ మాతను దర్శించుకున్న మంత్రి తలసాని.

హైదరాబాద్ ముచ్చట్లు:
రాష్ట్ర పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మహా శివరాత్రి సందర్భంగా ఏడుపాయల వనదుర్గా మాతను దర్శించుకున్నారు. శివరాత్రి సందర్భంగా జరిగే జాతరను మంత్రి తలసాని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడుపాయల దుర్గామాత దేవాలయానికి ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. తెలంగాణ వచ్చాక సీఎం కేసీఆర్ ఏడుపాయలకు అనేక నిధులుకేటాయించారన్నారు. గత ప్రభుత్వాలు ఏడుపాయల ను పూర్తిగా విస్మరించాయని, సీఎం కేసీఆర్ రాష్ట్రంలోని అన్ని దేవాలయాలను అభివృద్ధి చేస్తున్నారని తెలిపారు. ఏడుపాయల క్షేత్రం అన్ని రంగాల్లోఅభివృద్ధి చెందుతుందని, ఏడాదికేడాది ఏడుపాయల అభివృద్ధి చెందుతోందన్నారు..
Tags;Minister Talasani who visited Vanadurga Mata of Edupayala

Natyam ad